చెప్పుతో కొట్టినా.. ప్రేమిస్తున్నాడు
By Newsmeter.Network
యాంకర్ రష్మీ గౌతమ్.. బుల్లితెరపై సందడి చేస్తూనే.. హీరోయిన్‌గా నటిస్తోంది. రష్మీని ఓ వ్యక్తి ప్రేమిస్తున్నాడట. దాదాపు ఏడేళ్లుగా తన వెంట పడుతున్నాడట. ఛీ అన్నా, చెప్పుతో కొట్టినా.. ఆఖరికి ముఖం మీద ఉమ్మేసిన కూడా.. అమ్మడి మీద ప్రేమతో మనోడు ఇంకా వెంట పడుతున్నాడట.
బుల్లితెరపై రష్మీ, సుధీర్‌కు జంటకు పుల్ ఫాలోయింగ్ ఉంది. కెమిస్ట్రీ పండించడంలో వీళ్లే తర్వాతే ఎవరైనా. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. ఒకరి పేరు చెబితే.. మరొకరి పేరు గుర్తుకు వస్తుంది. ఇద్దరు కలిసి చేసే షోలకు ఉండే క్రేజే వేరు. అయితే వీరిద్దరిమధ్య ఏదో నడుస్తోందని గత కొన్నేళ్లుగా వింటూ వస్తున్నాం. ఈ ఎఫైర్స్ కారణంగానే సుధీర్‌కి పెళ్లి కావడం లేదని చెప్పుకుంటారు కొందరు. తాము ప్రేమలో లేమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు రష్మీ, సుధీర్.
కాగా ఇటీవల ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనేలా ఆమె మాటలు ఉన్నాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ చిత్ర ప్రమోషన్ కోసం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు యాంకర్ ప్రదీప్ మాచిరాజు వచ్చాడు. సుడిగాలి సుధీర్ స్కిట్‌లో ప్రదీప్‌తో పాటు రష్మీ చేసింది. ఇందులో రష్మీ.. ప్రదీప్‌తో సుధీర్ గురించి చెబుతూ సంచలనం సృష్టించింది. తనను సుధీర్ ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడని, వాడిని ఎలా వదిలించుకోవాలో తెలియడం అర్థం కావడం లేదంది. అంతటితో ఆగక.. ఛీ అన్నా, చెప్పుతో కొట్టినా, ముఖం మీద ఉమ్మేసినా కూడా సుధీర్ తనను ప్రేమిస్తూనే ఉన్నాడు. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ వాపోయింది. అయితే రష్మి ఏ ఉద్దేశంతో అలా అందో కానీ ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.