యాంకర్ రష్మీ.. ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితమే. బుల్లితెరపై జబర్దస్త్ షోలో తన అందచందాలతో అదరగొడుతుంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో చేస్తూ యాంకరింగ్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంటోంది. ఈ మధ్యన రష్మీ హీరోయిన్‌గా కూడా నటించింది. ‘గుంటూరు టాకీస్‌’ మూవీలో నటించిన రష్మీ.. తన అందాలతోనే సినిమా హిట్‌ అయిందని ప్రేక్షకులు చెబుతున్న మాట. అంతేకాదు రష్మీ గౌతమ్‌ అప్పుడప్పుడు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంది. మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలు, మూగ జీవాల సంరక్షణ విషయంలో ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తుంది.

అయితే తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే రష్మీ తన స్నేహితులతో కారులో వెళ్తూ హంగామా చేసింది. తన ఫ్రెండ్స్‌ తో కలిసి కారులో డ్యాన్స్‌ లు చేస్తూ ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

friends

Crazy friends always have the "best" ideas.

Rashmi Gautam ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಶುಕ್ರವಾರ, ಫೆಬ್ರವರಿ 21, 2020

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.