బజర్దస్‌ కామెడీ షో యువత హృదయాలను కొల్లగొట్టింది అనసూయ. నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ్మడు తన హాట్‌ హాట్‌ పోటోలను పోస్టు చేసి యువతకు నిద్రలేకుండా చేస్తుంది. తన అప్‌డేట్స్‌ కూడా క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటుంది. దాంతో ట్విట్టర్‌లో అమ్మడికి అప్పుడే 1 మిలియన్ ఫాలోయర్స్ వచ్చేశారు. దీంతో.. తన ఆనందాన్ని రంగమ్మత్త ముద్దుల రూపంలో తెలియజెప్పింది. అందరికీ ధన్యవాదాలు చెబుతూ.. ట్విట్టర్‌లో ముద్దు పెడుతున్న పోటోను ఫోస్టు చేసింది. తనను ఫాలో అవుతున్న వాళ్లందరికి నా ముద్దలు అంటూ దానికింద రాసుకొచ్చింది.

అన‌సూయ‌ ఒక‌టి రెండు కాదు.. దాదాపు 15 ఏళ్ల కిందే ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. అయితే.. గుర్తింపు తెచ్చుకోడానికి చాలా ఏళ్లు ప‌ట్టింది. ఓ టీవీ ఛానెల్‌లో యాంక‌ర్‌గా కూడా చేసింది. ఆ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ఈ భామ జాత‌కాన్ని మార్చేసింది. ఆ క్రేజ్‌లో వరుసగా సినిమా అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అయితే అనసూయ తొందర పడకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటుంది. క్షణం, రంగస్థలం సినిమాలే అందుకు ఉదాహరణ. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా జీవించేసిందనే చెప్పాలి. రంగ‌మ్మ‌త్త‌గా తెలుగు ప్రేక్ష‌కుల్లో సుస్థిర స్థాన్నాన్ని సంపాదించుకుంది. అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటించబోతుందని సమాచారం. రంగమ్మత్త పాత్ర కంటే మంచి పాత్రలో నటించనుందని సమాచారం. దాంతో పాటు అంధాధూన్ తెలుగు రీమేక్‌లో నితిన్‌తో కలిసి నటించబోతుంది అమ్మడు. అక్కడ టబు చేసిన పాత్రలో ఇక్కడ అను నటించనుందట.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్