అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా నాసా, స్సేస్‌ ఎక్స్‌ మరో అద్భుత విజయం

By సుభాష్  Published on  3 Aug 2020 1:57 AM GMT
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా నాసా, స్సేస్‌ ఎక్స్‌ మరో అద్భుత విజయం

అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా నాసా, స్పేస్‌ ఎక్స్‌ మరో అద్బుత విజయం సాధించాయి. స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ అంతరిక్ష నుంచి క్షేమంగా భూమికి చేరింది. అయితే ఒక కమర్షియల్‌ స్పేస్‌ మిషన్‌ అంతరిక్షం నుంచి భూమికి చేరడం ఇదే మొదటిసారి. స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ లో ప్రయాణించే వ్యోమగాములు డగ్‌ హర్లే. బాబ్‌ బెన్‌కీన్‌ ప్లోరిడా గల్స్‌ కోస్ట్ సమీపంలో గల్స్‌ ఆఫ్‌ మెక్సికో వద్ద ల్యాండయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. 14.48 గంటలకు సముద్ర జలాల్లో వీరు దిగారు.

వీరు క్షేమంగా చేరడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో 45 ఏళ్ల తర్వాత తొలి స్పాష్‌ డాన్‌ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ప్రైవేటు స్సేస్‌ ఏజన్సీ స్సేస్‌ ఎక్స్‌ ఈ ఏడాది మే చివరలో ఫాల్న్‌ 9 రాకెట్ల ద్వారా డ్రాగన్‌ క్యాప్సుల్‌ను నింగిలోకి పంపించింది. అందులో ప్రయాణించిన వ్యోమగాములు డగ్‌ హర్లే, బాబ్‌ బెన్‌కీన్‌ రెండు నెలల పాటు అమెరికా అంతరిక్ష కేంద్రంలో గడిపారు. అనంతరం తిరిగి క్షేమంగా భూమికి చేరుకున్నారు. సాధారణంగా చూస్తే అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్యాప్సుల్స్‌ ను భూ ఉపరితలంపై దిగుతుంటాయి. కజక్‌స్థాన్‌లోని ఎడారి ప్రాంతాలు అనువుగా ఉండటంతో అక్కడే ల్యాండ్‌ చేసేవారు. కానీ స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ అమెరికా తీరంలో క్షేమంగా దిగి చరిత్ర సృష్టించింది. అమెరికాలో స్పేస్ క్యాప్సుల్ దిగడం ఇది రెండోసారి. 45 ఏళ్ల క్రితం అపోలో కమాండ్ మాడ్యుల్ అమెరికాలో దిగింది.Next Story