అమెరికాలో వివాహిత గజం వనిత అనుమానాస్పద మృతి
By Newsmeter.Network Published on 7 Oct 2019 5:27 PM IST
హైదరాబాద్ : అమెరికాలోని నార్త్ కరోలినాలో గజం వనిత(38) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సూసైడ్ చేసుకుందంటూ నాగోల్‌లోని సాయి నగర్‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు వనిత భర్త. గత జులైలో అమెరికాలో ఉంటున్న భర్త దగ్గరకు వనిత వెళ్లింది. భర్త వేధింపులతో గత రెండు నెలల నుంచి తల్లిదండ్రులు , బంధువులతో వనిత కాంటాక్ట్‌లో లేదు. ముఖంపై దిండుతో అదిమి చంపినట్లుగా వనిత బంధువులు భావిస్తున్నారు. ఘటన అనంతరం వనిత భర్త శివకుమార్‌ను కరోలినా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్తింటి వేధింపులే తమ కుమార్తెను బలి తీసుకున్నాయని వనిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వనిత మృతితో ఆమె పుట్టింట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story