అమెరికాలో ఒక్క‌ రోజులో 94 వేల క‌రోనా కేసులు

By సుభాష్  Published on  31 Oct 2020 10:24 AM GMT
అమెరికాలో ఒక్క‌ రోజులో 94 వేల క‌రోనా కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి అమెరికాలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 94వేల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ముందే అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో క‌రోనా కేసులు రెట్టింపు అయ్యాయి. వ‌రుస‌గా రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో 90 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ తెలిపింది. మ‌రో వైపు అమెరికా ఎన్నిక‌ల పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. మంగ‌ళ‌వార‌మే దేశ అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నారు. సుమారు 21 రాష్ట్రాల్లో వైర‌స్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుతున్న‌ట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని స్వింగ్ స్టేట్‌లు కూడా ఉన్నాయి. ఇక అధ్యక్ష ఎన్నిక‌ల సంద‌ర్భంగా ర్యాలీలో పాల్గొంటున్న వారికి మాస్కులు అంద‌జేస్తున్నారు. స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. కొన్ని చోట్ల భౌతిక దూరం పాటిస్తున్నారు. మ‌రి కొన్ని ప్రాంతాల్లో కార్ల‌లోనే ఉంటూ ర్యాలీల్లో పాల్గొంటున్నారు.

కాగా, ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు అన్ని విధాలుగా ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేక‌ని కారణంగా క‌ట్ట‌డి కావ‌డం లేదు. వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌తో పాటు అన్ని దేశాలు తీవ్ర స్థాయిలో ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నాయి. కొన్నిదేశాల వ్యాక్సిన్లు ట్ర‌య‌ల్స్‌లో ఉంటే మ‌రి కొన్ని వ్యాక్సిన్లు తుది ద‌శ‌లో ఉన్నాయి.

Next Story