ఏపీ మాజీ మంత్రులపై క్రిమినల్ కేసు
By సుభాష్
అమరావతి భూ కుంభకోణంలో కొత్త మలుపు తిరిగింది. అమరావతి ప్రాంతంలో ఒక దళిత మహిళకు చెందిన భూమిని బలవంతంగా లాక్కొన్నారనే ఆరోపణలపై ఏపీ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఏపీ సీఐడీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరిపై క్రిమినల్, కుట్ర, మోసం, బెదిరింపు, ఎస్సీ,ఎస్టీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందులో వెంకటాపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహారావు, ఇద్దరు మాజీ మంత్రులున్నారు. నరసింహారావు తన భూమిని బలవంతంగా లాక్కున్నారని దళిత మహిళ బుజ్జమ్మ ఆరోపించింది.
ఈ సందర్భంగా సీఐడీ అధికారి మాట్లాడుతూ.. దళితులకు కేటాయించిన భూములకు ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లింకుండా బలవంతంగా లాక్కుందని, ఇందులో రూ. 25 లక్షలు ఇచ్చి, ఆమె నుంచి భూమిని తీసుకున్నారని తెలిపారు. తీసుకున్న భూమిని రెండు కోట్ల వరకు అమ్మారని తెలిపారు. కాగా, తన భూమిని బలవంతంగా లాక్కున్నారని, డబ్బులు చెల్లించాలని బాధితురాలు బుజ్జమ్మ నరసింహరావును అడుగగా, అతను డబ్బు చెల్లించడానికి నిరాకరించినట్లు వివరించారు. దీంతో ఆమె ఫిర్యాదు చేయడంతో వీరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.