అమరావతి : సీఎం వైఎస్ జగన్ ఏపీకి మూడు రాజధానులు కావాలని చేసిన ప్రకటనను చిరంజీవి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఏపీ రైతులు మండిపడుతున్నారు. జనసేన అధినేత, చిరంజీవికి స్వయానా తమ్ముడు అయిన పవన్ కల్యాణ్ రైతులకు సపోర్ట్ చేయడం సంతోషంగా ఉంది కానీ..జగన్ చేసిన ప్రకటనను చిరంజీవి సమర్థించడం పద్ధతి కాదంటున్నారు రాజధాని రైతన్నలు. ”మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఏ రోజూ ప్రజల సమస్యలపై మాట్లాడలేదు సరికదా కనీసం పట్టించుకోలేదు. అలాంటప్పుడు జగన్ ప్రకటనను మీరెలా సమర్థిస్తారు ? ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఇక్కడ మీ సినిమాలు చూడటానికి, ఆడించుకోవడానికే మీరు జగన్ ను కలిశారు గానీ ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చించింది లేదు. మీరు ఆంధ్రాలో ఉంటున్నారో..వైజాగ్ లో ఉంటున్నారో..హైదరాబాద్ లో ఉంటున్నారో..కూడా జనాలకు తెలియని పరిస్థితి ఏర్పడింది” అని ఓ రైతు మీడియాతో తన ఆవేదనను చెప్పుకున్నాడు.

అమరావతిలో ఆగని నిరసనలు

మరో రైతైతే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే సినిమాలు రిలీజ్ అవ్వనివ్వం అని స్ర్టాంగ్ వార్నింగే ఇచ్చాడు. చిరంజీవికి వైజాగ్ లో చాలా ఆస్తులున్నాయి కాబట్టే మూడు రాజధానులంటే నాకిష్టమని అన్నారని దుయ్యబట్టాడు ఆ రైతు. పిచ్చిపిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి సినిమాలు రిలీజ్ అవ్వకుండా ఆపేస్తామన్నాడు. రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి అని అతను డిమాండ్ చేశాడు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.