నేటి నుంచి 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

By రాణి  Published on  3 Jan 2020 6:35 AM GMT
నేటి నుంచి 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి, పరిసర గ్రామాల బంద్ కు రాజధాని జేఏసీ శుక్రవారం నుంచి బంద్ కు పిలుపునిచ్చింది. నేటి నుంచి రాజధాని కోసం భూములచ్చిన 29 గ్రామాల్లో అన్నీ బంద్ చేస్తున్నామని, ఈ సకల జనుల సమ్మెకు అసెంబ్లీ, సచివాలయం ఉద్యోగులు సహకరించాల్సిందిగా అమరావతి జేఏసీ కోరింది. అలాగే వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఈ సమ్మెకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. 29 గ్రామాల సకల జనుల నిర్ణయం మేరకే సమ్మె చేపడుతున్నట్లు జేఏసీ తెలిపింది. అమరావతి ప్రజలంతా సమ్మెలో పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే రైతులే జోలు పట్టుకుని నిధులు సమీకరించి, రాజధాని అమరావతిని నిర్మించేందుకు సహకరమందిస్తామన్నారు. రైతులిచ్చిన భూముల్లో మిగులు భూములను అమ్మినా రాజధానిని నిర్మించవచ్చని జేఏసీ సూచించింది.

రాజధానిని తరలించవద్దంటూ అమరావతి రైతులు చేస్తున్న ధర్నాలు, నిరసనలు వరుసగా 17వ రోజుకు చేరాయి. ఈ రోజు నుంచి రాజధాని సమీపంలోని 29 గ్రామాల్లో సకల జనుల సమ్మెకు జేఏసీ పిలుపునివ్వగా...రైతులు, స్థానికులంతా రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేస్తున్నాయి. నిరసనలు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసుల బూట్లను తుడిచేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. కనీసం మా ధర్నాలైనా మమ్మల్ని చేసుకోనివ్వండి అని విజ్ఞప్తి చేశారు. జగన్ కు దమ్ముంటే రైతులతో ముఖాముఖి గా మాట్లాడాలి గానీ...ప్రెస్ మీట్లు, అసెంబ్లీ సమావేశాల్లో ఇష్టమొచ్చిన ప్రకటనలు చేసి దొంగలా పారిపోకూడదన్నారు.

Next Story