మహేష్‌పై మళ్లీ బన్నీదే పైచేయి..

By సుభాష్  Published on  29 Aug 2020 5:17 AM GMT
మహేష్‌పై మళ్లీ బన్నీదే పైచేయి..

ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే మహేష్ బాబు ముందు.. అల్లు అర్జున్ తక్కువగానే కనిపిస్తాడు. మహేష్ ఎప్పుడో 'ఒక్కడు'తోనే పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత 'పోకిరి', 'దూకుడు', 'శ్రీమంతుడు' లాంటి సినిమాలో బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపి, రికార్డుల దుమ్ము దులిపి అసలైన సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలు వచ్చేసరికి అల్లు అర్జున్ రేంజ్ చాలా తక్కువ. కానీ గత కొన్నేళ్లలో మాత్రం బన్నీ అనూహ్యంగా ఎదిగాడు. తనూ 'సూపర్ స్టార్' ఇమేజ్ సంపాదించాడు. అతడి బాక్సాఫీస్ స్టామినాను అనూహ్యంగా పెంచేసిన సినిమా 'అల వైకుంఠపురములో'. మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో పోటీ పడి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో బన్నీ సినిమా మీద మహేష్ మూవీ కచ్చితంగా పైచేయి సాధిస్తుందన్న అంచనాలు తిరగబడ్డాయి. ఒక రోజు ఆలస్యంగా విడుదలైన 'అల..' మహేష్ సినిమాను దాటి ముందుకు దూసుకెళ్లిపోయింది. ఏకంగా రూ.140 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి 'సరిలేరు..'పై స్పష్టమైన పైచేయి సాధించింది. బన్నీ సినిమాతో పోలిస్తే రూ.20 కోట్లకు పైగానే మహేష్ మూవీకి షేర్ తక్కువ వచ్చింది. ఇది సూపర్ స్టార్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం.

అవును సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గంజాయి కొట్టేవాడు: రియా చక్రవర్తి

బాక్సాఫీస్ దగ్గర ఇలా మహేష్‌ను దాటిన బన్నీ.. ఇప్పుడు బుల్లితెరపైనా ఇలాగే పైచేయి సాధించాడు. మార్చిలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను టీవీలో ప్రసారం చేస్తే దానికి 23.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అప్పుడు ఆ రేటింగ్ చూసి వావ్ అనుకున్నారు చాలామంది. ఐతే లాక్ డౌన్ చాలా కట్టుదిట్టంగా నడుస్తుండి, జనాలంతా ఇళ్లకే పరిమితమైనపుడు రెండు నెలల ముందు రిలీజైన సినిమాకు ఆ రేటింగ్ వస్తే.. ఇప్పుడు లాక్ డౌన్ ఏమీ లేకుండానే, రిలీజైన ఏడు నెలలకు వచ్చిన 'అల వైకుంఠపురములో'కు 29.4 రేటింగ్ రావడం అనూహ్యమే.

బాక్సాఫీస్ దగ్గర మహేష్‌ను దెబ్బ కొట్టిన బన్నీ.. ఇలా బుల్లితెర మీదా పంచ్ ఇవ్వడం సూపర్ స్టార్ అభిమానులకు రుచించనిదే. కాకపోతే మహేష్ సినిమా భారీగా సబ్‌స్క్రైబర్లు ఉన్న అమేజాన్‌లో రిలీజయ్యాక టీవీల్లోకి వచ్చింది. కానీ 'అల..' నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ లాంటి మన వాళ్లలో పెద్దగా పాపులర్ కాని యాప్స్‌లో రిలీజవడం దీనికి కలిసొచ్చిందని భావిస్తున్నారు.

'ఆచార్య' కథ ఆరోపణలపై స్పష్టతనిచ్చిన మూవీ టీం

Next Story