బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడైనా స్పెషలేనని చెప్పాలి. ఇంకో వైపు అక్షయ్‌ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంకా ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. అంతేకాకుండా తాజాగా అక్షయ్‌ కుమార్‌ తన మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడుకు చెంది ట్రాన్స్‌ జెండర్ల కోసం గృహ నిర్మాణానికి రూ. కోటిన్నర నగదును విరాళంగా ప్రకటించారు.

అందుకు సంబంధించిన చెక్కును కోరియోగ్రఫర్‌, నటుడు లారెన్స్‌ తో కలిసి ఆదివారం ట్రాన్స్‌ జెండర్లకు అందజేశారు. ఈ విషయాన్ని లారెన్స్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ట్రాన్స్‌ జెండర్ల గృహ నిర్మాణం కోసం ఇంత పెద్ద మొత్తంలో నగదును విరాళంగా ప్రకటించడం దేశంలోనే తొలిసారి అంటూ లారెన్స్‌ చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం అక్షయ్‌ కుమార్ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లక్ష్మీ బాంబ్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా లారెన్స్‌ ట్రాన్స్‌ జెండర్ల కోసం చెన్నైలో ఓ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుసుకున్న అక్షయ్‌ కుమార్‌.. తాను కూడా భాగం కావాలన్నారు. దీంతో ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు. కాగా, కాంచన సినిమా చేస్తున్న సమయంలో చాలా మంది ట్రాన్స్‌ జెండార్లను కలిశానని లారెన్స్‌ చెప్పారు. వారి బాధలను అర్థం చేసుకుని భవన నిర్మాణానికి సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.