ప్ర‌ముఖ టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న ఢీ షో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి ద బెస్ట్ ఆఫ‌ర్స్ ఇస్తూ వ‌చ్చింది. ఢీ స్టేజీ మీద కంటెస్టెంట్స్ వారి టాలెంట్‌ను నిరూపించుకున్న వారంద‌రికీ వివిధ మార్గాల్లో ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. ఢీ మొద‌టి సీజ‌న్ నుండి  చాలా మంది హీరోయిన్లు అవ‌గా మ‌రికొంద‌రు కొరియో గ్రాఫ‌ర్స్, అసిస్టెంట్ కొరియో గ్రాఫ‌ర్స్ అయ్యారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో విడుద‌ల‌వుతున్న ప్ర‌తీ సినిమాకు ఢి షో నుండి వెళ్లిన వారే డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. అంత‌లా ఢీ కంటెస్టెంట్స్ పాతుకుపోయార‌ని చెప్పొచ్చు.

మ‌రెవ్వ‌రో ఎందుకు పింపుల్స్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ స్టేట‌స్ పొందిన సాయి ప‌ల్ల‌వినే ప్యూర్ ఎగ్జాంపుల్‌. ఢీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎగ్జిట్ అయిన సంగ‌తి మ‌నంద‌రికీ విధిత‌మే. ఆ కోవ‌లోనే మ‌రికొంద‌రు లేడీ కంటెస్టెంట్స్ శ్రేష్టి, హ‌క్సాఖాన్‌, ఫాల్గొని ఇలా చాలా మంది సినీ ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నారు.

ఇక ఢీ నుండి వ‌చ్చిన డ్యాన్స్ కొరియో గ్రాఫ‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. జానీ మాస్ట‌ర్‌, శేఖ‌ర్ మాస్ట‌ర్ ఇలా చాలా మందిని ఢీ షో టాలీవుడ్‌కు ప‌రిచయం చేసింది. కంటెస్టెంట్ వేస్తున్న స్టెప్పుల‌కు స్టార్ హీరోలు సైతం స‌లాం కొడుతున్నారు. అంత‌లా కంటెస్టెంట్స్ త‌మ‌కు అందుబాటులో ఉన్న ఢీ స్టేజీని వాడుకుంటూ వారి ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాటి చెబుతున్నారు.

తాజాగా, ఢీ కంటెస్టెంట్స్‌గా ఉన్న‌ ఐశ్వ‌ర్య, సుకుమార్‌ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఒక‌టి వ‌చ్చింది. ట్రాప్‌ రాజా పేరుతో తెర‌కెక్కిన ప్రైవేట్ ఆల్బ‌మ్‌లో ఐశ్వ‌ర్య ఒక సాంగ్‌లో క‌నిపించ‌నుంది. గాయ‌నీ గాయ‌కులు విద్యా, శిరీష పాడిన ఈ పాట‌కు స‌న్నీ ఆస్ట్ర‌న్ మ్యూజిక్ అందించారు. స‌చిన్ అనే కొత్త డైరెక్ట‌ర్ కొరియోగ్రిఫీ చేస్తున్న ఈ సాంగ్ అతి త్వ‌ర‌లో మ‌న ముందుకు రానుంది. సుకుమార్ – ఐశ్వ‌ర్య ఇద్ద‌రూ ఈ ప్రైవేట్ ఆల్బ‌మ్‌లో క‌లిసి యాక్ట్ చేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికే ఢీ స్టేజీపై ద బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వ‌డంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్న ఐశ్వ‌ర్య ప్రైవేట్ సాంగ్‌లోనూ దాన్నే రిపీట్ చేసిందంటూ షూట్ చూసిన వారు చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్