ముఖ్యాంశాలు

  • మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం
  • ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం
  • మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం
  • రాత్రికి రాత్రే మారిపోయిన పరిణామాలు
  • మోదీ – అమిత్ షా ‘మహా’ చాణక్యంతో శివసేనకు షాక్‌

ఎవరూ ఊహించలేదు. రాత్రికి రాత్రే రాజకీయ పరిణామాలు అంచనాలకు అందకుండా మారిపోయాయి. మోదీ -అమిత్ ఆడిన గేమ్‌లో శివసేన మైండ్ బ్లాక్‌ అయింది. పొలిటికల్ గేమ్‌ టేస్ట్‌ను శివసేనకు రుచి చూపించారు కమలనాథులు. రాజకీయ ఆట ఇంటే మీడియా ముందు కాదు..ఇలా ఆడాలి అంటూ శివసేనకు చూపించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరుగుతుందని గత వారం రోజులుగా అందరూ అనుకుంటున్నదే. కాని..ఇంత ట్విస్ట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రాత్రే..ఎన్సీపీ అధినేత పవార్‌ ఓ రాజకీయ ప్రకటన చేశారు. ఉద్దవ్ థాకరే సీఎం అన్నారు. మీడియా అంతా పెద్దపెద్ద బ్రేకింగ్‌లు నడిపింది. మహా నాటకానికి తెరపడిందని లైవ్‌లు తీసుకున్నారు. రాత్రికిరాత్రే అన్ని పేపర్లు ఉద్దవ్‌ సీఎం అంటూ ఫస్ట్ పేజీలో పెద్దపెద్ద అక్షరాలతో హెడ్ లైన్స్‌ పెట్టాయి.కాని..ఇక్కడ మోదీ – అమిత్ షా – శరద్ పవార్‌ మరోకటి తలిచారు. వారి తలిచిందే జరిగింది.

రాజకీయ కరువృద్థుడు, మరాఠా యోధుడు శరద్‌ పవార్‌ను ఎలా లొంగదీసుకోవాలో మోదీ – అమిత్ షా ముందుగానే స్కెచ్ వేసి పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందే శరద్ పవార్‌పై కేసుల కత్తిని వేలాడదీశారు. శరద్ పవార్‌లో ఆ భయం ఉంది. ఎన్నికల ఫలితాల తరువాత తోక జాడించడం మొదలు పెట్టడంతో మోదీ – అమిత్ షా అంతర్గత వ్యూహానికి పదును పెట్టారు . మోదీ – అమిత్ షా స్కెచ్‌ గురించి మహారాష్ట్రలోని బీజేపీ పెద్ద తలకాయలకు కూడా తెలియదంటే ఆశ్చర్యపోవాలి. చివరకు ఫడ్నవీస్‌ కి కూడా తెలుసోలేదో. ఇంత పకడ్బందీగా మోదీ -అమిత్ షా వ్యూహం ఖరారు చేశారు.

మూడ్రోజుల క్రితం ప్రధాని మోదీని పవార్ కలిసినప్పుడే న్యూస్ మీటర్ చెప్పింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరుగుతుంది. ఎన్సీపీని బీజేపీ లాగేసుకోబోతుందని. “పైకి రైతుల సంక్షేమం..లోపల మహా రాజకీయం” అనే హెడ్డర్‌తో ఓ ఆర్టికల్ కూడా న్యూస్‌ మీటర్‌ రాసింది. ఈ రోజున అదే నిజమైంది. న్యూస్ మీటర్‌ ఊహించిందే జరిగింది. వారు రైతు సంక్షేమం గురించి కాదు మహా రాజకీయ ఎత్తుల గురించి మాట్లాడుకున్నారని ఫడ్నవీస్‌ సీఎంగా ప్రమాణస్వీకారంతో తేలిపోయింది.105 సీట్లు ఉన్న బీజేపీ, 54 సీట్లు ఉన్న ఎన్సీపీ కలిసి మహారాష్ట్రలో రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేద్దామనుకున్న ఉద్దవ్ కల ఉత్తిగానే మిగిలిపోయింది.

మహారాష్ట్ర గేమ్‌లో బకరా అయింది శివసేన . బీజేపీ, పవార్ ఆడిన గేమ్‌లో సంజయ్ రౌట్ పావుగా మిగిలిపోయాడు. పవార్‌ ఆడించినట్లు ఆడిన రౌట్…తనకు తెలియకుండానే శివసేనను వీధిపాలు చేశాడు. ఇప్పుడు బీజేపీతో మైత్రి చెడిపోయింది. సీఎం పీఠం పోయింది. శివసేన,అలాగే సంజీవ్ రౌట్ పరిస్థితి ఇప్పుడు రెండుకు చెడ్డ రేవడి అంటారే అలా తయారైంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.