ముంబై : కొత్తబంగారులోకం చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్వేత బసు ప్రసాద్ తన ఫాలోవర్స్ కు షాకిచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 13న తన ప్రేమించిన ఫిల్మ్ మేకర్ రోహిత్ మిత్తల్ తో శ్వేతబసు ప్రసాద్ వివాహం జరిగంది. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వీరు రెండుసార్లు వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత తాము తమ వైవాహిక బంధానికి కొన్ని నెలల క్రితం స్వస్తి పలికినట్లు శ్వేత వెల్లడించారు. శ్వేత బసు, తన భర్త రోహిత్ పరస్పర అంగీకారంతోనే విడిపోయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొంది. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చామని చెప్పింది.

” ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చదవలేం. అంటే దాని అర్థం అది చెడు పుస్తకమని కాదు. ఆ పుస్తకాన్ని చదవలేమని కూడా కాదు. కొన్ని విషయాల్ని మధ్యలో వదిలేయడమే మంచిది. మధుర జ్ఞాపకాలను మిగిల్చి, నాలో స్ఫూర్తి నింపింనందుకు నీకు ధన్యవాదాలు రోహిత్. నీ జీవితం బాగుండాలని, గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా” అని శ్వేతా బసు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. ఈ ప్రకటన చూసిన ఆమె ఫాలోవర్స్ అంతా షాక్ కు గురయ్యారు. శ్వేతా బసు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.