సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్‌ పృధ్వీరాజ్‌ ఈ రోజు తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. నెల రోజుల కిందట వివాదస్పద పరిస్థితుల్లో ఆరోపణలు ఎదుర్కొని తొలగించబడ్డ పృద్వీరాజ్‌ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అనూహ్య పరిణామాలతో చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

చాలా రోజుల తర్వాత పృధ్వీరాజ్‌ కనిపించడం చర్చనీయాంశమైంది. కాగా, రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఎంతో హుషారుగా ఉండే ఆయన ఈసారి ముభావంగా కనిపించారు.

సుభాష్

.

Next Story