ఏపీ: ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ సోదాలు
By సుభాష్ Published on 3 Sept 2020 11:09 PM ISTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఏసీబీ దూకుడు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్ రిజిస్టార్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ తదితర కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మాక సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి, విజయనగర్ జిల్లా బలిజిపేట, విశాఖ జిల్లా కశింపేట, పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, గుంటూరు జిల్లా రాజుపాలెం, ప్రకారం జిల్లా ఉలవపాడు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా కూడేరు తహసీల్దారు కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాలపై జరిపిన సోదాల్లో మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.3,50,277 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అయితే అధికారుల తనిఖీల్లో భారీ అక్రమాలు గుర్తించినట్లు తెలుస్తోంది. రైతులకు పంపిణీ చేయకుండా ఉన్న పట్టదారు పాస్ పుస్తకాలను గుర్తించారు. కొన్ని కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల స్థానాల్లో ప్రైవేటు సిబ్బంది పని చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
మరో వైపు సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏసీబీ కొరఢా ఝులిపించింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కడప జిల్లా బద్వేలు, చిత్తూరు జిల్లా పీలేరు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లో అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇక లెక్కలు చూపించని రూ.9,23,940 స్ స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా సీఎం జగన్ ఆదేశాలతో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తించారు