రాజమహేంద్రవరం: జనసేన పార్టీకి కాలం కలిసి రావడంలేదు. ఎన్నికలు తరువాత ఒక్కొక్కరు మెళ్లిగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. ఆయన సతీమణి పద్మావతి కూడా జనసేనకు బై చెప్పారు. త్వరలో ఆకుల సత్యనారాయణ వైఎస్ఆర్‌ సీపీలో చేరతారని తెలుస్తోంది. ఆయనకు రాజమండ్రి రూరల్ బాధ్యతలు అప్పగించడానికి వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం ఒప్పుకున్నట్లు సమాచారం.

ఆకుల సత్యనారాయణకు మంచి వ్యాపారవేత్తగా పేరుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు ఆకుల సత్యనారాయణ. 2014-19 మధ్య బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమహేంద్రవరం పరిసరాల్లో ఆకుల సత్యనారాయణకు సొంత క్యాడర్ ఉంది. అనుచర వర్గం కూడా బలంగా ఉంది. మంచి వ్యక్తిగా , సున్నిత మనస్కుడిగా సత్యనారాయణకు పేరుంది. ఆకుల సత్యనారాయణ వైఎస్ఆర్ సీపీలో చేరితే అది ఆ పార్టీకి బలమేనని లోకల్ టాక్‌.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.