ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ‘ఛలో’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకొంది. ఈ సినిమా హిట్‌ కొట్టేయడంతో విజయ్‌దేవరకొండతో మరోసారి ‘డియర్‌ కామ్రెడ్‌’ మూవీతో అదరగొట్టింది. ఇక తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాతో హిట్‌ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.

కాగా, రష్మిక ఓ ఈవెంట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ అభిమాని వచ్చి ఆమెతో సెల్ఫీ దిగేందుకు వచ్చి ఆమెను ముద్దు పెట్టుకున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రష్మిక ఒక్కసారిగా షాక్‌కు గురై.. షాక్‌ నుంచి తెరుకునేలోపే అతను పారిపోగా, అక్కడున్న వారంతా అవాక్కై.. ఈ వీడియోను నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ గా మారింది. అసలు రష్మికపై వస్తున్న వార్తలు అంతా అబద్దం. అసలు ఇది జరిగింది రష్మిక మందన్నకు కాదు.. నటి అషిక రంగనాథ్‌కు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. స్పందించిన పోలీసులు వెంటనే ఆ వీడియోను సోషల్‌ మీడియా నుంచి డిలీట్‌ చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.