షాకింగ్: పరుగులు పెడుతున్న బంగారం.. ఎక్కడ ఎంతంటే

By సుభాష్  Published on  29 Jun 2020 10:25 AM GMT
షాకింగ్: పరుగులు పెడుతున్న బంగారం.. ఎక్కడ ఎంతంటే

దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక్క రోజు దిగినట్లే దిగి మళ్లీ భగ్గుమన్నాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా మార్పులు చోటు చేసుకోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇక హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 230 పెరిగి ప్రస్తుతం 46,450కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.230 పెరిగి ప్రస్తుతం రూ.50,660కి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఆల్‌టైమ్‌ అధిక ధర ఇదే కావడం గమనార్హం.

ఇక వెండి ధర కూడా అంతే పరుగులు పెడుతోంది. కిలో వెండి రూ.410 పెరిగి ప్రస్తుతం రూ.48,120 చేరుకుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా బంగారం ధరలు ఇలా పెరుగుతుంటే సాధారణ పరిస్థితుల్లో ఏ మేరకు ఉంటాయోనని బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఇలా..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

హైదరాబాద్‌ : రూ. 46,450

ఢిల్లీ : రూ. 47,250

ముంబై : రూ. 47,300

చెన్నై : రూ. 46,450

బెంగళూరు : 45,750

కోల్‌కతా :47,670

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..

హైదరాబాద్‌ : రూ. 50,660

ఢిల్లీ : రూ. 48,450

ముంబై : రూ. 48,300

చెన్నై : రూ. 46,450

బెంగళూరు : రూ. 49,900

కోల్‌కతా : రూ. 48,940

Next Story