2019లో తెలుగులో తెరకెక్కిన ‘బయోపిక్’ సినిమాలు ఇవే

By సుభాష్  Published on  26 Dec 2019 9:11 AM GMT
2019లో తెలుగులో తెరకెక్కిన ‘బయోపిక్’ సినిమాలు ఇవే

వెండితెరపై ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ కొనసాగుతోంది. ఒక బయోపిక్ సినిమా వచ్చిందంటే చాలు వరుసగా బయోపిక్ లే వస్తుంటాయి. సినీ రాజకీయ నేతల జీవిత చరిత్రలను తెరకెక్కిన సినిమాలనే ప్రక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక 2019లో కొన్ని బయోపిక్ లు సందడి చేశాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం.

కథానాయకుడు

నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపైకి తీసుకువచ్చారు. నందమూరి బాలకృష్ణ. అయన బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడుగా రెండు పార్టులుగా నిర్మించారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ తన నటన ద్వారా ఎంతో మెప్పించారు.

యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే మూవీ తెరకెక్కింది. ఇందులో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. ఈ బయోపిక్ కు మంచి ఆదరణే లభించింది.

లక్ష్మీస్ NTR:

లక్ష్మీస్ NTR నందమూరి తారకరామారావు రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాల రూపంలో 'లక్ష్మీస్ NTR' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు.

జేర్సీ

హీరో నాటి నటించిన చిత్రం ‘జెర్సీ’. ప్రముఖ క్రికెటర్ రమణ్ లాంబ జీవితానికి దగ్గరగా ఈ సినిమా ఉందనేది సోషల మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమాకి పెద్దగా కలెక్షన్లు రాకపోయినా ప్రేక్షకులను మెప్పించింది.

మల్లేశం

మల్లేశం ప్రముఖ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తన తల్లి కోసం ఆసుయంత్రాన్ని చింతకింది మల్లేశం పడ్డ ఇబ్బందులు ఏంటనేవి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.

సైరా

చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో ఉయ్యాలవాడగా చిరంజీవి నటించారు. ఈ సినిమాకి మంచి ఆదరణే లభించింది.

జార్జిరెడ్డి

ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలుకు ప్రాణం పోసిన నాయకుడు జార్జిరెడ్డి. ఈయన జీవిత కథ ఆధారరంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘జార్జిరెడ్డి’ అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో సందీప్ మాధవ్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు విడుదలకు ముందే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఇక విడుదలైన తర్వాత మంచి ఫలితం లభించింది.

Next Story
Share it