FactCheck : ఈ వైరల్ ఫోటో అనంత పద్మనాభస్వామి దేవాలయానికి చెందింది కాదు

No, this viral photo does not belong to Kerala Temple. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం కొలనులోని

By Nellutla Kavitha
Published on : 19 Oct 2022 8:55 PM IST

FactCheck : ఈ వైరల్ ఫోటో అనంత పద్మనాభస్వామి దేవాలయానికి చెందింది కాదు

కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం కొలనులోని ఒక మొసలి ఇటీవల మరణించింది. దాదాపుగా 75 సంవత్సరాల వయసున్న ఆ మొసలి పేరు బబియ. ఆ ముసలి కేవలం శాఖాహారం మాత్రమే తీసుకునేదని భక్తులు చెపుతారు. అయితే ఆ మొసలికి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొసలి తలమీద ఒక వ్యక్తి తన తలను ఆనించి ఉంచిన ఆ ఫోటోను నెటిజన్లు వైరల్గా సర్క్యులేట్ చేశారు.


https://twitter.com/ShobhaBJP/status/1579324069509750784?s=20&t=_rGrRJkhcTlM7_nlL4bXOQ


నిజ నిర్ధార‌ణ‌ :

అయితే ఆ ఫోటోలో నిజమెంత? ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి చెందిన మొసలి కాదు. కోస్టారికాకు చెందిన పోచో అనే పేరున్న మొసలి. అలాగే దానిని కాపాడిన జాలరి చీటో (Gilberto Chito Shedden) గా తేలింది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసినప్పుడు యూట్యూబ్ లో దీనికి సంబంధించి ఒక వీడియో బయటపడింది. 44.59 సెకండ్ల ఈ వీడియోలో 20.55 దగ్గర వైరల్ అయిన ఫోటోకి సంబంధించిన వీడియో క్లిప్ ఉంది. దీనిని 2014 జూలై 27న యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

https://youtu.be/xRG6TBmIc60


ఇక మొసలి పోచోతో పాటుగా తన ఫ్రెండ్, సంరక్షకుడు అయినా చీటోపై 2013లోనే "టచ్చింగ్ ద డ్రాగన్" అనే ఒక డాక్యుమెంటరీ కూడా విడుదలైంది.

https://m.imdb.com/title/tt6232316/?ref_=ext_shr_lnk

పోచో మరణించిన తర్వాత 2011లో CBSNEWS.com అనే ఒక యూట్యూబ్ ఛానల్ తన మరణానికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేసింది.

https://youtu.be/IHLsOa_YnaM


ఇక పోచో మొసలికి సంబంధించి వికీపీడియా ఒక పేజీ కూడా క్రియేట్ చేసింది. అందులో మొసలికి సంబంధించి కంప్లీట్ హిస్టరీ ఉంది. ఈ పేజ్ లో పోచో, చీటోకి మధ్య ఉన్న స్నేహ సంబంధాలని వివరిస్తూనే, పోచో మాంసాహారం కూడా తినేదని వివరించారు.

https://en.wikipedia.org/wiki/Pocho_(crocodile)

సోషల్ మీడియాలో బబియాకి సంబంధించి వైరల్ అయిన క్లెయిమ్ తప్పు.


Claim Review:ఈ వైరల్ ఫోటో అనంత పద్మనాభస్వామి దేవాలయానికి చెందింది కాదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story