FactCheck : డిసెంబర్ 31, జనవరి 1న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేయనున్నారా..?
Is Centre Planning to Impose Nationwide Lockdown From 31 Dec to 1 Jan not yet. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్
By న్యూస్‌మీటర్ తెలుగు
డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని వైరల్ పోస్ట్ లో ఉంది.
ఎక్కువ మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తికి దారితీస్తుందని పోస్ట్ పేర్కొంది. 2022 జనవరి 3న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని కూడా వైరల్ మెసేజీలలో ఉంది.
నిజ నిర్ధారణ :
డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
COVID-19 విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌లను తెలుసుకోవడం కోసం న్యూస్ మీటర్ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పేర్కొంటూ ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు కనుగొనబడలేదు. తాజా GO ఆగస్టు 28న జారీ చేయబడింది. అప్పటి నుండి ఎటువంటి అప్‌డేట్‌లు జోడించబడలేదు. అంతేకాకుండా అటువంటి ప్రకటనలు ఏ అధికారిక వ్యక్తులు కూడా ట్వీట్ చేయలేదు.
లాక్డౌన్ విధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రణాళికలు రూపొందించనప్పటికీ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. పరిస్థితిని బట్టి స్వతంత్రంగా లాక్డౌన్లు విధించాయి.
COVID-19 కేసుల పెరుగుదల దృష్ట్యా ఆంక్షలను విధించిన రాష్ట్రాలు ఇవే :
ఢిల్లీ: అవసరమైతే ఆంక్షలు విధించేందుకు ఢిల్లీ సిద్ధమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లు సమాచారం. అవసరమైతే ఆంక్షలు విధిస్తామని, ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తన COVID-19-సంబంధిత ఆంక్షలను డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు పొడిగించింది. (మూలం: Live Mint మరియు India.com)
తమిళనాడు: రాష్ట్రంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రంలోని బీచ్‌లలో నూతన సంవత్సర వేడుకల రోజున మూసివేయబడతాయి. (మూలం: టైమ్స్ ఆఫ్ ఇండియా)
కర్ణాటక: వారాంతపు పరీక్ష పాజిటివిటీ రేటు 5% దాటితే మరియు ఆక్సిజన్ బెడ్‌ల ఆక్యుపెన్సీ 60%కి పెరిగితే జిల్లాల్లో లాక్‌డౌన్ విధించడాన్ని ప్రభుత్వం పరిగణించాలని కర్ణాటక కోవిడ్-19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించింది. (మూలం: ది హిందూ)
పశ్చిమ బెంగాల్: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 ఆంక్షలను జనవరి 15 వరకు పొడిగించింది. డిసెంబర్ 24 నుండి జనవరి 1 వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య కొన్ని పరిమితులను సడలించింది. (మూలం: ANI న్యూస్)
ముంబై: ముంబై పోలీసులు డిసెంబర్ 16 నుంచి 31 వరకు నగరవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడడం, బహిరంగ సభలను నిర్వహించడాన్ని నిషేధిస్తుంది. (మూలం: బిజినెస్ స్టాండర్డ్)
పుదుచ్చేరి: లాక్‌డౌన్ 2 జనవరి 2022 వరకు పొడిగించబడింది. రాత్రి కర్ఫ్యూ ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. రాత్రి కర్ఫ్యూ డిసెంబర్ 24, 25, 30 మరియు 31 తేదీలలో మరియు జనవరి 1న తెల్లవారుజామున 2 గంటల వరకు పూర్తిగా సడలించబడింది. (మూలం: డెక్కన్ క్రానికల్)
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. పరిస్థితిని బట్టి లాక్‌డౌన్‌లు విధించే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. డిసెంబర్ 31 మరియు జనవరి 1 తేదీలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.