FactCheck : ఈ సంఘటన అయిదేళ్ల క్రితం జరిగినది

Five Years Old Video Circulated As Recent In Telangana.

By Nellutla Kavitha
Published on : 25 Oct 2022 3:59 PM IST

FactCheck : ఈ సంఘటన అయిదేళ్ల క్రితం జరిగినది

కర్ణాటక విద్యాసంస్థల్లో ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఇవ్వలేకపోయింది. హిజాబ్ నిషేధాన్ని ఎత్తి వేయడాన్ని నిరాకరిస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే హిజాబ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది.

https://www.facebook.com/100072967230256/videos/657452015737713/

బురఖా ధరించిన ఇద్దరు మహిళలు ఒక సూపర్ మార్కెట్ లో దొంగతనానికి పాల్పడ్డారనేది వైరల్ వీడియో సారాంశం.

https://twitter.com/Ambuj_IND/status/1582745991056306176?s=20&t=f_XS5VXt1QQ0IpLApRgv3w

బుర్కా ధరించిన మహిళలు సూపర్ మార్కెట్లో దొంగతనానికి పాల్పడుతున్నారని, రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారని, అది తెలంగాణాలో జరిగిందని ట్విట్టర్లో నెటిజన్లు షేర్ చేశారు. హిజాబ్ బ్యాన్ చేయడానికి ఇదే సరైన సమయం అంటూ కామెంట్లు కూడా చేశారు.

నిజ నిర్ధార‌ణ‌

అయితే సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన ఈ వీడియోలో నిజమెంత న్యూస్ మీటర్ టీం ఫాక్ట్ చెక్ చేసి చూసింది.

గూగుల్లో కీ వర్డ్ సెర్చ్ చేయడంతో పాటుగా ఇన్ విడ్ కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసి చూసింది టీం. దీంతో ఈ వీడియో 2017 లో యూట్యూబ్ లో మొదటగా పోస్ట్ అయినట్టుగా తేలింది.

జూలై 8, 2017 న కోట తేజ నాయుడు అనే వ్యక్తి యూట్యూబ్ లో దీనిని పబ్లిష్ చేశాడు .

https://youtu.be/E0j1H_D07hU

ఇదే వీడియో జూలై 10, 2017 న నిర్మల్ డి-మార్ట్ సూపర్ మార్కెట్లో జరిగినట్టుగా ఫేస్ బుక్ లో మరో వ్యక్తి పోస్ట్ చేశారు. నాన్ ముస్లిం మహిళలు బురఖా ధరించి సూపర్ మార్కెట్ లో దొంగతనానికి పాల్పడ్డారని ఈ ఫేస్ బుక్ పోస్ట్ సారాంశం.

https://fb.watch/gmcAVJJT5z/

దీంతో పాటుగానే డిసెంబర్ 30, 2017 లో మరొక పోస్ట్ ఫేస్ బుక్ లో పబ్లిష్ అయ్యింది. అందులో కూడా హిందూ మహిళలు బురఖా ధరించి దొంగతనానికి పాల్పడ్డారని పోస్ట్ చేశారు.

https://fb.watch/gm7qUGaFjC/

వీడియోలో చాలా క్లియర్ గా తెలుగులో మాట్లాడుతున్నట్టుగా ఉంది. కాబట్టి, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిన సంఘటనగా అర్థమవుతోంది. అయితే ఎక్కడ జరిగిందనేది ఐడెంటిఫై కాలేదు.

కానీ ఇది ఇటీవల జరిగింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాత్రం తప్పు. ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటనని ఇప్పుడు జరిగినట్టుగా తిరిగి పోస్ట్ చేస్తున్నారు.

Claim Review:ఈ సంఘటన అయిదేళ్ల క్రితం జరిగినది
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story