ముఖ్యాంశాలు

  • రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్‌లో దారుణం
  • మైనర్‌ బాలికపై యువకుడు పలు మార్లు అత్యాచారం
  • బాలికపై అత్యాచార ఘటనను ఖండించిన బాలల హక్కుల సంఘం

రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్‌ బాలికపై యువకుడు పలు సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శంషాబాద్‌ మండలం చారినగర్‌లో చోటు చేసుకుంది. చారినగర్‌ గ్రామానికి చెందిన హరి అనే యువకుడు అదే గ్రామానికి మైనర్‌ బాలిక నమ్మించి పలు మార్లు దారుణానికి ఒడిగట్టాడు. కాగా గత కొన్ని రోజులుగా బాలిక తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడింది. తల్లిదండ్రులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించారు. కాగా వైద్యుల రిపోర్టులో బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచార ఘటనను బాలల హక్కుల సంఘం ఖండించింది.

Also Read: ప్రియుడి ఎదుటే.. ప్రియురాలిపై పోలీసుల అత్యాచారం

నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకొని తీసుకోవాలని శంషాబాద్‌ డీసీపీకి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం. సమాజంలో చిన్నారులపై, మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. శారీరక వాంఛలు తీర్చుకునేందుకు కామాంధులు ఏ మాత్రం వెనకాడడం లేదు. వయస్సుతో పని లేకుండా.. చిన్నారులు, పెద్ద వారు అనే తేడా లేకుండా కామ మృగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి.. మహిళల రక్షణం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గత కొన్ని నెలల క్రితం శంషాబాద్‌ పరిధిలో జరిగిన దిశ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

Also Read: 6నెలలుగా ఆంటీతో ఛాటింగ్‌.. భర్త లేని సమయంలో..

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.