ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు వ‌చ్చినా.. కామాంధుల్లో మార్పు రావ‌డం లేదు. వావి వ‌రుస‌లు మరిచి త‌మ కాంఛ వాంచ తీర్చుకుంటున్నారు. ఓ యువ‌కుడు త‌న పక్కింటిలో ఉండే వివాహితపై క‌న్నేశాడు. ఆమె భ‌ర్త లేని స‌మ‌యం చూసి కిటిలోంచి ఇంట్లోకి ప్ర‌వేశించి త‌న కోరిక తీర్చాల‌ని ఆమెను వేదించాడు. అత‌ని కోరిక‌ను ఆ మ‌హిళ తిరస్క‌రించ‌డంతో ఆమెను ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొట్టాడు. ఆమె కూతురిని క‌ట్టేసి.. కూతురి ముందే ఆంటీపై అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

కోల్‌క‌తా ప‌ట్ట‌ణంలో ఓ వివాహిత‌(40) త‌న భ‌ర్త‌, కూతురి(9)తో క‌లిసి నివ‌సిస్తోంది. వారి ప‌క్కింటిలో ఆశిష్ పార్మల్(30) అనే యువ‌కుడు ఉన్నాడు. వారి పక్కింట్లోనే ఉండే ఆశిష్ ఆ కుటుంబంతో చ‌నువుగా ఉండేవాడు. ఈ క్రమంలో ఆంటీపై కన్నేశాడు. ఆమె భర్త లేనప్పుడు ఇంటికెళ్లి పాపతో ఆడుకుంటున్నట్లు నాటకమాడుతూ సరదాగా మాట్లాడేవాడు. ఆమెను ఎలాగైనా త‌న దారిలోకి తెచ్చుకోవాల‌ని ప్లాన్ వేశాడు. ఈ నెల 14వ తేదీ శనివారం అంకుల్ ఏదో పనిమీద వేరే చోటికి వెళ్లాడు. ఇదే మంచి అదునుగా బావించిన ఆశిష్.. ప్లాన్ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కిటికీలో నుంచి ఇంట్లోకి వెళ్లాడు.

ఆంటీని నిద్ర‌లేపి త‌న కోరిక తీర్చాల‌ని వేధించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మ‌ర్యాద‌గా వెళ్లు.. లేకుంటే అరిచి గోల చేస్తాన‌ని అత‌డిని హెచ్చ‌రించింది. స‌హానం కోల్పోయిన ఆశిష్ ఆంటీని తీవ్రంగా కొట్టాడు. ఆమె కేక‌ల‌కు కూతురు లేచి ఏడ‌డం మొద‌లెట్టింది. ఆ బాలికను కుర్చీకి కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేశాడు ఆ కామాంధుడు. అనంతరం ఆంటీను మంచంపై పడేసి పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. సుమారు అరగంట పాటు ఆంటీపై అత్యాచారం చేసిన ఆ కామాంధుడు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ భర్తను చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు.

కొద్ది స‌మ‌యం త‌రువాత తేరుకున్న బాధితురాలు కుమార్తె కట్లు విప్పి అనంతరం ఈ విషయాన్ని స్థానికులకు చెప్పింది. వారి సాయంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆశిష్ పై గ‌తంలో చాలా అత్యాచార ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మహిళలతో పరిచయం పెంచుకుని వారిని లైంగికంగా వేధించడం, వీలు చిక్కితే వారిపై లైంగిక దాడికి పాల్పడటం అతడి నైజంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.