ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన కామాంధుల్లో మార్పు రావ‌డం లేదు. ఒంట‌రి మ‌హిళ క‌నిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. ఓ యువ‌తిని ఓ యువ‌కుడు నిత్యం వేదిస్తున్నాడు. ఆమె క‌నిపిస్తే చాలు అక్క‌డ ఇక్క‌డ చేతులు వేసి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. కొన్ని రోజులు ఆ యువ‌కుడి వేధింపులు భ‌రించింది. రోజు రోజుకి అత‌ని వేధింపులు ఎక్కువ కావ‌డంతో.. భ‌రించ‌లేక అత‌ని పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘ‌ట‌న ముంబైలో జ‌రిగింది.

ముంబయిలోని డోంబివిలీ ప్రాంతానికి చెందిన తుషార్ పుజారా(27) జులాయిగా తిరిగేవాడు. అదే ప్రాంతానికి చెందిన యువ‌తి ఒంట‌రిగా ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అత‌ని క‌న్ను ఆమెపై ప‌డింది. నిత్యం ఆ యువ‌తి వెంట ప‌డుతూ త‌న కోరిక తీర్చాల‌ని వేదించేవాడు. ఆఫీసు నుంచి తన ఇంటికి వెళ్లే సమయంలో యువతిని అడ్డగించి ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ లైంగికంగా వేధించేవాడు. త‌న‌కు ఇలాంటివి ఇష్టం లేద‌ని, త‌న వెంట ప‌డొద్ద‌ని ఆమె ఎంత‌గా ప్రాదేయ‌ప‌డినా వినిపించుకునేవాడు కాదు. త‌న కోరిక కాదంటే చంపేస్తాన‌ని బెదిరించేవాడు. రోజు రోజుకు అత‌ని వేదింపులు ఎక్కువ‌వుతున్నాయి. దీంతో అత‌నికి బుద్ధి చెప్పాల‌ని ఆ యువ‌తి నిర్ణ‌యించుకుంది.

అత‌డికి ఫోన్ చేసి.. ‘నీ కోరిక తీర్చ‌డానికి నేను సిద్దం.. కాక‌పోతే ఇక్క‌డ వ‌ద్దు ఫ‌లాన చోటుకి రావాల‌ని’ చెప్పింది. దీంతో తుషార్ ముందు వెనుక ఆలోచించ‌కుండా ఆ యువ‌తి చెప్పిన చోటికి వెళ్లాడు. ముంగానే వేసుకున్న ప‌థ‌కం ప్ర‌కారం తుషార్ రాగానే ఇద్ద‌రు వ్య‌క్తులు అత‌న్ని ప‌ట్టుకున్నారు. ఆ యువ‌తి అత‌న్ని చిత‌క‌బాదింది. కోపం త‌గ్గ‌క‌పోవ‌డంతో అత‌ని ప్యాంటు విప్పి పురుషాంగం కోసేసింది. దీంతో అత‌ను బాధ‌తో అరుపులు పెట్టాడు. అత‌ని అరుపులు విన్న స్థానికులు అక్క‌డ‌కు చేరుకున్నారు. అప్ప‌టికే ఆ యువ‌తి, అత‌న్ని ప‌ట్టుకున్న ఇద్ద‌రు అక్క‌డి నుంచి పారిపోయారు. స్థానికులు అత‌న్ని ఆస్ప‌త్రిలో చేర్పించారు. కాగా.. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. కాగా పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.