నవయుగా కంపెనీ ముందు కార్మికుల ధర్నా

ముఖ్యాంశాలు

  • తమ జీతాలను చెల్లించాలని కార్మికుల డిమాండ్‌
  • సంవత్సరం నుంచి జీతాలు లేవని కార్మికులు ఆవేదన
  • వెంటనే 25 శాతం బకాయిలు చెల్లించాలని డిమాండ్

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. తమకు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం నుంచి తమకు రావాల్సిన 100 కోట్ల రూపాయల బకాయిలను నవయుగా కంపెనీ ఇవ్వాల్సిందిగా కార్మికులు డిమాండ్ చేశారు. నవయుగా కంపెనీ ఎండీ రేపు, మాపు అని తమను డబ్బుల కోసం తిప్పుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం సబ్‌ కాంట్రాక్ట్ తీసుకొని నవయుగా ఇంజనీరింగ్‌ కంపెనీ ఆధ్వర్యంలో కార్మికులు పోలవరం ప్రాజెక్ట్ పనులు చేశారు. కాగా తమకు వెంటనే 25 శాతం బాకీలు చెల్లించాలని లెని యెడల ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మా సమస్యలు తీర్చాలని కార్మికులు వేడుకుంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.