ఆంటీతో అక్రమ సంబంధం..డబ్బులు ఎక్కువ అడిగిందని చేతి నరాలు కట్ చేసి..

విల్లుపురంకు చెందిన ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె చేతి నరాలు కట్ చేసి..బండరాయితో కొట్టి చంపేసి నగ్నంగా రైల్వే క్వార్టర్స్ లో పడి ఉండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అలాగే అంతకు ముందురోజు రాత్రి మహిళతో మైనర్ బాలుడు(17) ఉండటాన్ని చూసినట్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపగా..హత్యకు ముందు ఆమె రేప్ కు గురైందని రిపోర్టులో వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుడిగా ఉన్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజం చెప్పాడు. బాధిత మహిళ భర్తను వదిలేసి విల్లుపురం రైల్వే క్వార్టర్స్ లో ఒంటరిగా జీవిస్తోంది. ఒంటరిగా ఉంటున్న మహిళతో స్థానికంగా ఉండే 17 ఏళ్ల బాలుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రోజూలాగే ఈ నెల 14వ తేదీన కూడా వారిద్దరూ కాలనీలోని పాడుబడిన ఇంట్లో ఏకాంతంగా గడిపారు. తర్వాత తనను అనుభవించినందుకు మహిళ డబ్బులివ్వాల్సిందిగా అడిగింది. ఆమెకు బాలుడు డబ్బివ్వగా..ఇంకా కావాలని డిమాండ్ చేసింది. తన వద్ద లేవని చెప్పడంతో..అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తమ మధ్యనున్న అక్రమ సంబంధం విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్తానని బెదిరించింది.

మహిళ మాటలకు కోపోద్రిక్తుడైన బాలుడు ఆమె చేతి నరాలు కట్ చేసి బండరాయితో తలపై కొట్టాడు. ఆమె రక్తపు మడుగులో ఉండి..ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగానే..బాలుడు మరోసారి తన కామకోరికను తీర్చుకున్నాడు. ఇలా మహిళను ఎలా హత్య చేయాల్సి వచ్చిందో..బాలుడు చెప్పిన వివరాలన్నింటినీ నమోదు చేసుకున్న పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేసి..కోర్టులో హాజరుపరిచారు. అతడు మైనర్ కావడంతో కోర్టు బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించాల్సిందిగా ఆదేశించింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.