అదేంటి.. రెస్టారెంట్‌కు సాప్రదాయ దుస్తుల్లో మహిళ వస్తే తప్పేంటి.. యాజమాన్యంపై నెటిజర్లు మండిపాటు ఎందుకు.. అనుకుంటున్నారా.. అలా ఆలోచిస్తే మీరు తప్పులో కాలేసినట్లే.. ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో గల అంబియెన్స్‌ మాల్‌లో కైలిన్‌ అండ్‌ ఇవీ రెస్టారెంట్‌ ఉంది. ఈ రెస్టారెంట్‌కు సంగీత నాగ్‌ అనే మహిళల ఈనెల 10న భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లింది. రెస్టారెంట్‌ వద్దకు వెళ్లిన సంగీత నాగ్‌.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడే ఉన్న రెస్టారెంట్‌ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.

ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించడంతో.. ఆమెకు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించిన వారికి తమ రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని చెప్పి ఆమెను వెనక్కి పంపించారు. ఈ ఘటనను వీడియో తీసిన మహిళ.. తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేసి, తనకు రెస్టారెంట్‌ వద్ద ఎదురైన అవమానాన్ని తెలియజేసింది. ఇండియాలో ఓ రెస్టారెంట్‌ స్మార్ట్ క్యాజువల్స్‌కు అనుమతిస్తుంది కానీ.. ఇండియన్‌ వేర్‌కు ఇవ్వదా? భారతీయులు గర్వంగా ఉండటానికి ఏం అవుతోంది..? అని ట్వీట్‌లో చేసింది.

ఈ వీడియో వైరల్‌గా మరడంతో రెస్టారెంట్‌ యాజమాన్యం తీరును నెటిజర్లు తీవ్రంగా తప్పుబట్టారు. సంగీతకు మద్దతు తెలుపుతూ రెస్టారెంట్‌ యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు. దీంతో దిగొచ్చిన రెస్టారెంట్‌ యాజమాన్యం జరిగిన ఘటనపై సంగీతకు క్షమాపణలు చెప్పింది.

Newsmeter.Network

Next Story