ఇద్దరు విద్యార్థులతో.. ఆ మహిళా టీచర్‌.. 9సార్లు..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ మహిళా టీచర్‌.. ఊపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చింది. తన కామ కోరికలను విద్యార్థులతో తీర్చుకుంది. చివరికి ఆమె బండారం బయట పడడంతో జైలు పాలు అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లూసియానాలోని మిడిల్ స్కూల్లో ఓ మహిళ(34) సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. శారీరక సంబంధం కోసం.. స్కూల్ అధికారిక ఈ-మెయిల్ నే వాడేది. ముందుగా స్కూల్ ఈ-మెయిల్ నుంచి మెయిల్ చేసేది. తర్వాత పర్సనల్ ఈ-మెయిల్ ద్వారా విద్యార్థులను ముగ్గులోకి దించేది. తన నగ్న ఫోటోలు, వీడియోలను విద్యార్థులకు పంపి వారిని రెచ్చగొట్టేది. తన మనసులోని మాట చెప్పి.. వారిని తన ఇంటికి రప్పించుకునేది. కారులో తన ఇంటికి తీసుకువచ్చి.. వారితో తన లైంగిక వాంఛ తీర్చుకునేది. ఇలా కనీసం 9 సార్లు ఆ మహిళా టీచర్‌ ఇద్దరు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడింది. అంతటితో ఆగకుండా వారిలో కామవాంఛ పెంచేందుకు వారికి గంజాయిలాంటి మాదక ద్రవ్యాలను ఇచ్చేది.

ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. ఈ నిజాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు మహిళా టీచర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్