నిర్భయ లాంటి ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా మద్యప్రదేశ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లాలోని టారెగావ్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళను కారులో ఎక్కించుకుని నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఫిబ్రవరి 17న గ్రామస్థులతో కలిసి బాధిత మహిళ మావై గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. అనంతరం తిరుగు ప్రయాణంలో సున్రేహా గ్రామం వద్ద నలుగురు వ్యక్తులు కారులో వచ్చిన నిందితులు.. తామూ అటువైపు వెళ్తున్నామని ఆమెను కారులో ఎక్కించుకున్నారు. రూటుమార్చి అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందులను 24గంటల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్