తమ్ముడి భార్యపై స్నేహితులతో కలిసి అన్న అత్యాచారం.. షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన భర్త

దేశంలో అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లో చూస్తే మహిళలపై జరిగే ఘోరాలు అంతే లేకుండా పోయింది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వావి వరుసలు మరిచిన ఓ మానవ మృగాడు సొంత తమ్ముడి భార్యపైనే కన్నేసి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధలో ఉన్న భార్యకు భర్తవచ్చి మరింత షాకిచ్చే విషయం చెప్పాడు. మా అన్నను సుఖపెట్టేందుకే నిన్న పెళ్లి చేసుకున్నానని భర్త చెప్పడంతో ఆమెకు నోటిమాట రాలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బులంద్‌ షెహర్‌ నగరానికి చెందిన మహ్మద్‌ హఫీజ్‌ అనే యువకుడికి ఇటీవల వివాహం జరిగింది. ఇక కొద్దిరోజులకే హఫీజ్‌ అన్న రఖీబ్‌ తమ్ముడి భార్యపై కన్నేశాడు. ఆమెను సొంత చేసుకోవాలని ఎన్నోసార్లు ప్లాన్‌ కూడా చేశాడట. ఓ రోజు తమ్ముడు ఇంట్లో లేని సమయంలో కొత్త పెళ్లి కూతురిని బెదిరించి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అత్యాచారం చేసిన దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఎవరికైన చెబితే ఈ వీడియోను బయటపెట్టి పరువు తీస్తానని బెదిరించాడు.

కాగా, సాయంత్రం ఇంటికొచ్చిన భర్తకు ఈ విషయం చెప్పగా, అంతలోనే భర్త షాకింగ్‌ విషయం చెప్పాడు. మా అన్నకు నువ్వంటే మోజు. చాలా ఇష్టం. అతడిని సుఖ పెట్టడానికే నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో బాధితురాలు ఒక్కసారిగా షాకైంది. అంతేకాదు నా మాట వినకపోతే త్రిపుల్‌ తలాక్‌ చెప్పేస్తానని బెదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త, అతని అన్న, స్నేహితుడిపై కేసు నమోదు చేశారు.

ఈ విషయం బయటపడగానే నిందితుడు రఖీబ్‌ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఆ యువతి చెప్పినదంతా అబద్దమని ఆమె అత్తమామలు చెబుతున్నారు. తన కొడుకు హఫీజ్‌కు గతంలోనే పెళ్లి అయిపోయిందని, ఇప్పుడు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకుంటాడని వారు వాదిస్తున్నారు. తమ కుటుంబం పరువు తీసేందుకే ఆ యువతి ఇలాంటి కట్టుకథలు అల్లుతోందని అంటున్నారు. తమ ఇద్దరు కుమారులు అమాయకులని, ఆ యువతి ఏదో ఆశించి ఇదంతా చేస్తోందని ఆరోపిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *