వారిద్దరిదీ ప్రేమ వివాహం. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా..ఎలాంటి చికాకులు లేకుండా వారి దాంపత్యం చాలా అనోన్యంగా సాగింది. కొన్నాళ్లకు వారికి పాప పుట్టింది. కూతురు పుట్టిందని తెలుసుకున్న తండ్రి ఆనందానికి అవధుల్లేవు. ఇంతలోనే వచ్చిన డీఎన్ఏ రిపోర్ట్ చూసిన అతను తల్లడిల్లిపోయాడు. తప్పటడుగులు వేస్తున్న కూతురు..భార్య చేసిన తప్పుడు పనులకు పుట్టిందని తెలిసి ఆవేదనకు గురయ్యాడు.

యూకేకు చెందిన లీహా కార్డీస్ (20) నర్సరీలో పనిచేస్తున్నప్పుడే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లినాటికి ఆమె వయసు 17 సంవత్సరాలు. కొన్నాళ్లకు వారికికూతురు పుట్టడంతో భర్త చాలా ఆనందించాడు. కానీ కూతురి బ్లడ్ గ్రూప్, డీఎన్ఏ వివరాలు అతడివి కాదని తెలుసుకున్న తండ్రి కుంగిపోయాడు. అవి 13 ఏళ్ల బాలుడికి మ్యాచ్ అయిందని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. ఈ రిపోర్టులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో..మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొనడం నేరంగా పరిగిణించిన వారు..లీహ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

విచారణలో భాగంగా ఆ మైనర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సదరు మహిళ బాలుడితో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకుందా ? లేక ఇద్దరూ ఇష్టపూర్వకంగానే కలిశారా అని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు బాలుడు చెప్పిన సమాధానాలు విన్న పోలీసులు విస్తుపోయారు. ఒక రోజు ఆమె బాగా మద్యం సేవించి తన ఇంటికి రాగా..ఇద్దరం కలిసి యూ ట్యూబ్ వీడియోలు చూశామని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె తనను హగ్ చేసుకుని ముద్దులు పెడుతూ..శృంగారం చేసేందుకు ప్రేరేపించిందని తెలిపాడు. ఆమె అలా చేస్తుండటంతో ఆ పని చేయక తప్పలేదని, ఆ తర్వాతి రోజు నుంచి రోజుకొకసారైనా కలుస్తుండేవాళ్లమని తెలిపాడు.

కాగా..2017లోనే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం మొదలైనట్లు తేలింది. క్రమంగా ఇలానే కొనసాగుతూ వచ్చింది. భర్తకు తెలిసిన నిజంతో..లీహ్ జైలు పాలవ్వగా..ఆమె మాత్రం కూతురు తన భర్తకే పుట్టిందని వాదించింది. బాలుడు తనను ఎప్పుడు కలిసినా కామ కోరికలతో తాకేవాడని, ఒకానొక సందర్భంలో అతడితో కలవక తప్పలేదని చెప్పుకొచ్చింది. బాలుడు మాత్రం ఆ మహిళే తనను లోబరుచుకుందని చెప్తున్నాడు. రెండేళ్ల క్రితమే నమోదైన ఈ కేసు ఇటీవల క్రౌన్ కోర్టులో విచారణకు రావడంతో ఈ విషయం వైరల్ అయింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.