ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ఎలా దొరికారంటే?

వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను తీసేవరకు దారితీసింది. తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ మహిళ.  భర్త మృతికి యాక్సిడెంట్‌నే కారణమంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి పోలీసులు తమదైన న శైలిలో విచారణ చేపట్టగా ప్రియుడు, భార్యే కలిసి హతమార్చారని పోలీసుల విచారణలో తేలింది.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నందలపాడుకు చెందిన శేఖర్‌ ఆటోలో మినరల్‌ వాటర్‌ విక్రయిస్తూ జీవించేవాడు. శేఖర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. శేఖర్‌ భార్యకు సమీప బంధువైన ఆటోడ్రైవర్‌ బలరాంకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పలుసార్లు వీరి మధ్య సంభాషణలు నడుస్తున్న క్రమంలో శేఖర్‌ గమనించి వారిద్దరిని మందలించాడు. దీంతో అప్పటి నుంచి శేఖర్‌పై కక్షపెంచుకున్నభార్య..తమకు అడ్డు వస్తున్న శేఖర్‌ను తప్పించాలని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. పథకంలో భాగంగా.. ఆరోగ్యం సరిగా లేదని, పెద్దమ్మ గుడికి వెళ్లి పూజ చేయించుకుని వద్దామని భర్తను ఒప్పించింది. బుధవారం తెల్లవారు జామున శేఖర్‌, నాగమ్మ ద్విచక్ర వాహనంపై గుడికి బయలు దేరారు. మార్గంమధ్యలో తనకు బహిర్భూమికి వస్తుందని భార్య చెప్పడంతో శేఖర్‌ బైక్‌ను పక్కకు ఆపాడు. అప్పుడే ప్రియుడు ఆటోలో వచ్చి శేఖర్‌ను ఒక్కసారిగా చెక్క బ్యాట్‌తో తలపై మోదాడు. తీవ్ర రక్త స్త్రావంతో శేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగినట్లుగా బైక్‌ను కిందపడేసి శేఖర్‌ భార్య ప్రియుడు అటోలో వెళ్లిపోయారు. శేఖర్‌ అక్క ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు బ్యాట్‌ ఆధారంగా భార్య నాగమ్మ, ప్రియుడు బలరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *