ఓ యువ‌కుడు అదే ప్రాంతానికి చెందిన యువ‌తిని ప్రేమించాడు. వీరి ప్రేమ‌కు పెద్ద‌లు ఒప్పుకోలేదు. అత‌నికి వేరే యువ‌తితో పెళ్లి చేశారు. ఇటీవ‌ల అత‌ని భార్య పుట్టింటికి వెళ్లింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో అత‌ని భార్య పుట్టింటిలో ఉండిపోయింది. ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఆ భ‌ర్త త‌న మాజీ ప్రేయ‌సిని రెండో వివాహాం చేసుకున్నాడు. ఈ విష‌యం తెలిసిన అతని మొద‌టి భార్య అత‌డిపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు స‌ద‌రు భ‌ర్త‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లో జ‌రిగింది.

పాలీగంజ్‌లో నివ‌సించే ధీర‌జ్‌కుమార్.. ఓ యువ‌తిని ప్రేమించాడు.అయితే.. వీరి వివాహానికి పెద్ద‌లు ఒప్పుకోలేదు. దీంతో అత‌ను పెద్ద‌లు చూసిన దుల్హిన్ బ‌జార్‌కు చెందిన వేరే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి వివాహాం జ‌రిగి సంవ‌త్స‌రం కూడా కాలేదు. ఈ దంప‌తులు అనోన్యంగా ఉండేవారు. ఇటీవ‌ల భార్య పుట్టింటికి వెళ్లింది. స‌రిగ్గా అదే టైంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ను విధించింది. దీంతో ఎక్క‌డి వారు అక్కడే ఉండ‌వ‌ల‌సి వ‌చ్చింది. ప‌లుమార్లు భార్య‌కు ఫోన్ చేసి ర‌మ్మ‌ని కోరాడు. భ‌ర్త మాటిమాటికి ఫోన్ చేస్తుండ‌డంతో ఓ బంధువు సాయంతో బైక్ పై భ‌ర్త ద‌గ్గ‌రికి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్ర‌యాణించ‌డానికి వీలులేద‌ని చెప్పారు.

లాక్‌డౌన్ కార‌ణంగా రాక‌పోక‌లు నిలిచిపోవ‌డం, ఆంక్ష‌ల కార‌ణంగా ఆమె తిరిగి భ‌ర్త ద‌గ్గ‌రికి వెళ్ల‌లేక‌పోయింది. తను పిలిస్తే రాలేద‌ని భార్య‌పై కోపం పెంచుకున్నాడు. భార్య‌కు విడాకులు ఇచ్చేయాని నిర్ణ‌యించుకున్నాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఈ విష‌యాన్ని త‌న మాజీ ప్రేయ‌సికి చెప్పి ఆమెను ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యం తెలిసిన అత‌ని మొద‌టి భార్య అత‌ని పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.