అక్ర‌మ సంబంధాల కోసం ప్రాణాలు తీయ‌డానికైనా వెన‌కాడ‌డంలేదు. తాత్కాలిక శారీర‌క సుఖం కోసం వెంప‌ర్లాడుతున్నారు. ఈ వ్యామోహంతో ప‌డి జీవిత భాగ‌స్వామి ప్రాణాలు తీస్తున్నారు. ఓ మ‌హిళ త‌న కంటే వ‌య‌సులో 20 ఏళ్లు చిన్న‌వాడైన యువ‌కుడితో అపైర్ పెట్టుకుంది. త‌న రాస‌లీల‌ల‌కు భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని.. ప్రియుడితో క‌లిసి క‌ట్టుకున్న భ‌ర్త‌ను హ‌త్య‌చేసింది. ఈ ఘ‌ట‌న డెహ్రాడూన్ లో వెలుగుచూసింది.

ఉత్తరాఖండ్ లోని, డెహ్రాడూన్, వికాస్ నగర్ లోని, జుడ్లి అడువాలా అనే గ్రామంలో రాజు (పేరు మార్చాం) భార్యా , ఇద్దరు పిల్లలతో కలిసి కాపురం ఉంటున్నాడు. రాజు భార్య పద్మకి (42) ( పేరు మార్చాం) అదే ఊళ్లో ఉంటున్న 20 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారితీసింది.

భ‌ర్త లేని స‌మ‌యంలో ప్రియుడిని పిలిపించుకుని త‌న కామవాంఛ‌లు తీర్చుకునేది. కొద్దిరోజుల పాటు వీరి బాగోతం సాఫీగా సాగింది. ఆమె కంటే 22 ఏళ్ళ చిన్నవాడు కావటంతో ఎవరికీ వీరిపై అనుమానం కలగలేదు. ఈ అవకాశాన్ని వారిద్దరూ అనుకూలంగా మలుచుకున్నారు. ఓ రోజు ఈ విష‌యం భ‌ర్త రాజుకు తెలిసిపోయింది.

ప‌ద్ద‌తిగా ఉండాలంటూ భార్య‌ను హెచ్చ‌రించాడు. త‌మ బంధానికి భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని బావించి అత‌న్ని అడ్డుతొల‌గించుకోవడానికి ప్రియుడితో ప్లాన్ వేసింది. ఏప్రిల్ 4 శనివారం అందరూ ఇంట్లో నిద్రపోతుండగా ప‌ద్మ త‌న ప్రియుడిని ఇంటికి పిలిచింది.

త‌న‌తో తెచ్చుకున్న తుపాకీతో రాజు త‌ల‌పై కాల్చి చంపాడు. అనంత‌రం అక్క‌డ నుంచి పారిపోయాడు. ప‌ద్మ ఏమీ తెలియ‌న‌ట్లు వెళ్లి ప‌డుకుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం నిద్ర లేచి త‌న భ‌ర్త‌ను ఎవ‌రో చంపేశారు అని ఏడ్వ‌టం మొద‌లుపెట్టింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.రోహిత్ ను తలపై కాలుస్తున్నా పక్కగదిలోనే పడుకుని ఉన్న పద్మకు కనీసం మెలుకవ రాకపోవటం.. ఆమెకు తెలియకపోవటంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఇదే అనుమానాన్ని రోహిత్ తండ్రి మెల్హార్ , ఇతర బంధువులు కూడా వ్యక్త పరిచారు. పోలీసులు పద్మను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు సాయంతో నే భర్తను హత్యే చేసినట్లు నేరం ఒప్పుకుంది. వెంటనే పోలీసులు నేరం చేసిన యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.