దేశంలో వివాహేత సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కాపురాలన్నీ కూలిపోతున్నారు. కొందరు వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భార్యనే కడతేరుస్తున్నారు. భార్యను కాదని, ప్రియురాళ్ల మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల ఊబిలో కూరుకుపోయి భార్యనే చంపేయాలనుకున్నాడు ఓ భర్త. పోలీసుల వివరాల ప్రకారం..

కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన పూజిత అనే యువతి సాప్ట్‌ వేర్‌ ఇంజనీరింగ్‌గా పని చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన మీనన్‌ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులుగా ప్రశాంతంగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. పెళ్లాయిన మూడు నెలలకే భర్త తన ఉద్యోగాన్ని మానేసి భార్య సంపాదనపైనే జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను పట్టించుకోవడం మానేశాడు.

ఇక భర్త రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పూజితకు అనుమానం వచ్చి ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది. భర్త వేరే యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. దీంతో భర్త ఇంటికి వచ్చిన తర్వాత బుద్దిగా ఉండాలని, అలాంటివి పెట్టుకోవద్దని హెచ్చరించింది. ఇక భర్త చేసిన ఘనకార్యం భార్యకు తెలిసిపోవడంతో భార్యపై మీనన్‌ మరింత రెచ్చిపోయాడు. ప్రియురాలిని ఏకంగా ఇంటికి తీసుకొచ్చి భార్య ముందే బెడ్‌రూమ్‌లో రాసలీలు కొనసాగించాడు. దీంతో పూజిత తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెద్ద సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, ఇక నుంచి పద్దతిగా ఉంటానని అందరి ముందు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Also read:

ఈ క్రమంలోనే పూజిత ఉద్యోగం బెంగళూరుకు బదిలీ అయ్యింది. దీంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికే కాపురం మార్చారు. కొన్ని రోజులు బాగానే ఉన్న భర్త … మళ్లీ పాతపద్దతినే కొనసాగించాడు. బెంగళూరులో మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు కట్టుకున్న భార్యను చంపేసి రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌ కూడా చేశాడట. ఇక భర్త తీరుపై అనుమానం వచ్చి మళ్లీ తల్లిదండ్రులకు చెప్పింది పూజిత‌. తల్లిదండ్రులు అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.