మన నిత్య జీవితంలో మనిషికి నీరు తప్పనిసరి. నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని వైద్యులు ఎన్నో సార్లు వివరిస్తుంటారు. నీరు అనేది దాహం తీర్చానికే కాదు. పలు వ్యాధులను సైతం దూరం చేస్తుంటుంది. అంతేకాదు శృంగార జీవితంలో కూడా నీళ్లు ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు ఒంట్లో పడేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Water Is Very Important For Romance2

నీళ్లు బాగా తాగకపోతే శృంగార జీవితంలో సమస్యలు ఎదురవుతాయని, అదే మంచినీళ్లు ఎక్కువగా తాగినట్లయితే శృంగారం జీవితం మెరుగు పడుతుందంటున్నారు. నీళ్లు తక్కువగా తాగినట్లయితే డీహైడ్రేషన్‌ సమస్య ఉత్పన్నమవుతుందంటున్నారు. హైడ్రేటెడ్‌ గా లేని శరీరం ఊరికే అలసిపోతుందని, ఈ కారణంగా రతిక్రీడ కొనసాగించలేరని, శృంగారం మీద ఆసక్తి కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు.

ఇక స్త్రీలు శృంగారం మొదలు పెట్టాలంటే లూబ్రికేషన్‌ చాలా అవసరం. యోని లూబ్రికేట్‌ అయితే పని సునాయాసంగా అయిపోతుంది. మంచినీళ్లు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది. మన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని తొలగించడానికి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. మంచి ఆరోగ్యకరమైన శరీరమే, అరోగ్యకరమైన శృంగారానికి సాధనం.

Water Is Very Important For Romance1

నీరు శృంగారానికే కాదు..మరెన్నిటికో ఉపయోగం

మంచినీళ్లు తాగడం వల్ల శృంగారానికే కాదు.. మరెన్నిటికో ఉపయోగం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. చర్మంపై మృతకణాలు తక్కువగా ఉండి, చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది. అలాగే శృంగార జీవితంలో ఆరోగ్యకరమైన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెప్పనక్కరలేదు. శరీరంలో సెల్స్‌ అన్ని బాగా పని చేయాలంటే తగిన నీరు అవసరం. అందుకే నీళ్లు బాగా తాగాలి. అప్పుడే హార్మోన్‌ ఇబ్బందులు కనిపించవు. అంతేకాదు శృంగారంలో ఎలాంటి సమస్యలు ఉండకుండా అలసిపోకుండా ఉంటారని చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *