ప్రకాశం: అధికారులకు సైతం లైంగిక వేధింపులు ఆగడం లేదు. తొటి ఉద్యోగులే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మెజిస్ట్రేట్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ వీఆర్‌ఏ అధికారిణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన తండ్రిలాంటి వయసు గల మెజిస్ట్రేట్‌ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. క్రిస్మస్‌ సందర్భంగా కురిచేడు మండలం పడమర వీరాయపాలేనీకి చెందిన వీఆర్‌ఏ ఎమ్మార్వో కార్యాలయ సిబ్బందికి విందు ఇచ్చింది. వీఆర్ఏ ఇచ్చిన విందులో తొటి ఉద్యోగులు పాల్గొన్నారు. మెజిస్ట్రేట్‌ మాత్రం రాలేదు.

ఆ తర్వాత రోజు నుంచి తనకు విందు ఇవ్వాలంటూ వీఆర్‌ఏను మెజిస్ట్రేట్‌ అడగడం ప్రారంభించాడు. ద్వందార్థాలతో మాట్లాడుతున్న.. వయసులో పెద్దవాడని, మెజిస్ట్రేట్‌ కావడంతో ఆమె అలా ఊహించుకోలేకపోయింది. కాగా శనివారం నాడు వీఆర్‌ఏతో మెజిస్ట్రేట్‌ మరింత అసభ్యకరంగా ప్రవర్తించాడు. నాకు కోడి కూరతో పాటు నువ్వు కావాలంటూ అడిగాడు. అలా అడగడం సరికాదని చెప్పిన వినడం లేదని వీఆర్‌ఏ ఆరోపించింది. తనను మెజిస్ట్రేట్‌ శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, వెనుక నుంచి కౌగిలించుకున్నాడని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు ఈ కేసును విచారిస్తున్నట్లు సమాచారం.

తహశీల్దార్‌ను ఇప్పటికే పోలీసులు పలు మార్లు విచారించారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వీఆర్‌ఏ ఆరోపణలను తహశీల్దార్‌ కొట్టిపారేశారు. వీఆర్‌ఏ చేసిన ఆరోపణలు అన్ని అబద్దమని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారించాలన్నారు. తన మంచితనాన్ని చెడగొట్టేందుకే వీఆర్‌ఏ ఇలాంటి ఆరోపణలు చేసిందని తహశీల్దార్‌ అంటున్నారు. కాగా ఈ కేసుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తైన అసలు నిజాలు బయటపడనున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. అయినా కూడా మహిళలకు లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. అధికారులైన, సామాన్య మహిళలైనా.. కామాంధులు వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్