పెళ్లైన 17 రోజులకే బిడ్డకు జన్మ.. అసలు నిజం చెప్పిన యువతి

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లైయిన 17 రోజులకే ఓ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఉన్నావ్‌ జిల్లాలోని ఓ యువతికి గత సంవత్సరం ఏప్రిల్‌ 19న ఓ యువకుడితో వివాహం జరిగింది. సదర్‌ కొత్వాలి ప్రాంతంలో ఆమె తన భర్త, అత్తమామలతో కలిసి నివాసం ఉంటోంది. కాగా పెళ్లి జరిగిన కొన్ని రోజులకే ఆమెకు వీపరితమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను అత్తింటి వారు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం వైద్యులు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆమె ప్రస్తుతం పురిటి నొప్పులతో బాధపడుతోందని చెప్పారు. దీంతో అత్తింటివారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ యువతికి వైద్యులు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు.

ఈ విషయమై భర్త, అత్తమామలు ఆమెను నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. తనను చిన్నప్పటి నుంచి తండ్రి, సోదరుడు కలిసి లైంగికంగా అనుభవించేవారని తెలిపింది. తండ్రి, సోదరుడితో పాటు మరో 11 మంది అనేక సార్లు తనపై అత్యచారానికి ఒడిగట్టారని తెలిపింది. ఈ విషయం గ్రామ పెద్దలు కూడా తనను అనేక సార్లు శారీరకంగా వాడుకున్నారని తెలిపింది. 13 ఏళ్ల వయసు నుంచి అత్యచారానికి గురవుతున్నాని బాధితురాలు అత్తింటివారి ముందు వాపోయింది. దీనిపై యువతి అత్తింటి వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నావో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాట్లు సమాచారం. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. అయినా కూడా మహిళలకు లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. అధికారులైన, సామాన్య మహిళలైనా.. కామాంధులు వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు.పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న సభ్య సమాజంలో ఏ మాత్రం మార్పు రావడం లేదు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.