ప్రస్తుతం సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదు. పరాయి వ్యక్తి ఆకర్షణలో పడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తమను నమ్ముకున్న వారిని నట్టేట ముంచేస్తున్నారు. ఇటీవల కాలంలో మామ-కోడలు, సవతితల్లి-కొడుకు లాంటి బంధాలు ఉన్నవారు సైతం అక్రమ సంబంధాలు పెట్టుకుని మానవసంబంధాలకు మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా యూకేలో సవతి తల్లి మైనర్‌ బాలుడితో తన కామ వాంచలు తీర్చుకుంది. ఆ బాలుడిని స్కూల్‌కు పంపకుండా దాదాపు రెండు సంవత్సరాలుగా తనకు బానిసగా చేసుకుంది.

యూకేలోని కాజిల్ హిల్లో ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మొదటి భార్య చనిపోయింది. దీంతో అతడు మరో మహిళ(38)ను రెండో వివాహం చేసుకున్నాడు. అతనికి అప్పటికే 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ముగ్గురు ఓకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఆమెకు విపరీతమైన కామకోరికలు ఉండేవి. భర్త ఇచ్చే సుఖం ఆమెకు సరిపోక.. ఆమె కన్ను ఆ బాలుడి పై పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో తన అందచందాలతో ఆ బాలుడిని లైన్‌లో పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ప్రతిరోజు అతడిని స్కూల్‌కు వెళ్లకుండా ఆపి బెడ్రూమ్‌లోకి తీసుకొని పోయేది. ఇలా దాదాపు రెండు సంవత్సరాలు చేసింది.

ఇటీవల బాలుడి ప్రవర్తనలో మార్పులు రావడంతో అనుమానం వచ్చిన బాలుడి తండ్రి నిఘా పెట్టాడు. ఇంట్లో స్పీకర్ ఏర్పాటు చేసి వారి మాటలను వినడం ప్రారంభించాడు. బాలుడి, సవతి తల్లి మధ్య ఏదో సంబంధం ఉందని గ్రహించి ఆమెను నిలదీశాడు. అయితే బాలుడు తన సొంత కొడుకుతో సమానమని, సవతి తల్లి సరిగ్గా చూసుకోవడం లేదని అందరూ అనుకోకూడదన్న ఉద్దేశంతో అతడితో చనువుగా ఉంటున్నట్లు చెప్పింది.

ఆమె చెప్పిన మాటలు అతనికి నమ్మబుద్ది కాలేదు. దీంతో కొడుకుతో ఏకాంతంగా మాట్లాడి అసలు నిజం తెలుసుకున్నాడు. సవతి తల్లి తనను రోజూ సెక్స్ కోసం ఒత్తిడి తెస్తోందని, తనని స్కూల్‌కి కూడా పంపకుండా బెడ్రూమ్‌‌లోకి లాక్కెళ్తుతోందని చెప్పాడు. దీంతో షాకైన అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి వాంగ్మూలం ద్వారా కోర్టులో ఆమెపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం ఆ మహిళను దోషిగా నిర్ధారించింది. మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఆమె ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.