ఈ మహిళది లేటు వయసు.. అయినా కోరికలు మాత్రం ఘాటైనవే. టీనేజ్‌ కుర్రాళ్లతో కోరికలు తీర్చుకుందామనే క్రమంలో జైలు పాలైంది ఓ మహిళ. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఆమె వయసు 50 ఏళ్లు. ఇంత వయసున్నా..కోరికల్లో మాత్రం తక్కువేం కాదు. అంతేకాదు ఆమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. తన కోరికలు తీర్చుకోవడానికి కూతుళ్ల బాయ్‌ ఫ్రెండ్‌ను వినియోగించుకుంది. టీనేజ్‌ కుర్రాళ్లతో శృంగారం మత్తులో దిగేందుకు ప్లాన్‌ వేసింది. చివరికి అమ్మగారి లీలలు బయటపడటంతో ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తోంది.

స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన యూకేలో వెలుగుచూసింది. నిందితురాలు ‘జూలీ’ అనే మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు. టీనేజ్‌ ఏజ్‌లోనే ఉన్న ఆ ఇద్దరు కూతుళ్లు.. తమ బాయ్‌ ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకొచ్చి తల్లికి పరిచయం చేశారు. అంతే వయసు దాటిపోయిన ఆ మహిళ వారికి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. ఇంకేముందు వారితో శృంగారంలో మునిగితేలింది. అంతేకాదు ఇద్దరితో మరింత శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టేసింది. ఇలా ఇద్దరితో దాదాపు 20 సార్లు సెక్స్‌ పాల్గొందట.

ఇక అప్పటి నుంచి జూలీ తరచూ ఇద్దరి కుర్రాళ్లను శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టేదట. ఇక చివరకు అందులో ఓ కుర్రాడు జూలీ పోరు తట్టుకోలేక  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా, జూలీ చేసిన ఘనకార్యాలు బయటపడ్డాయి. టీనేజ్‌ కుర్రాళ్లతో బలవంతంగా శృంగారం చేసిందని, వారిని లొంగదీసుకునేందుకు ఎన్నో సార్లు ఒత్తిళ్లు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక పోలీసులు పూర్తి దర్యాప్తు వివరాలు కోర్టుకు అందించడంతో విచారణ చేపట్టిన కోర్టు.. జూలీకి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మొత్తం మీద లేటు వయసులో ఉన్న కోరికలు కొంపముంచాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.