కృష్ణా జిల్లాలో మరోసారి మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఐదేళ్ల చిన్నారులపై ఓ మానవమృగం లైంగిక దాడికి యత్నించింది. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అరుణోదయ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి పక్కనే ఉన్న ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులపై ఐటీ విద్యార్థి (17) లైంగిక దాడికి యత్నించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిలకలపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.