దేశంలో ట్రాఫిక్‌ సమస్యల అధికమవుతోంది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటలకొద్ది ప్రయాణం. ట్రాఫిక్‌ కారణంతో చికాకులేస్తుంటుంది. ఓ మాజీ ఎమ్మెల్యేకు ట్రాఫిక్‌ కష్టాల కారణంగా ఏకంగా ఇల్లు వదిలిపెట్టే వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మాజీ ఎమ్మెల్యేను ఈ ట్రాఫిక్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. షామ్లి జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన చక్కెర ఫ్యాక్టరీకి దగ్గరగా కైరానా మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్‌ బన్సాల్‌ నివాసం ఉంది.  అయితే ప్రతీ రోజు వందల కొద్ది చెరుకు లోడ్లతో కూడిన బండ్లు, వాహనాలు రాజేశ్వర్‌బన్సాల్‌ ఇంటి ముందర నుంచే ఫ్యాక్టరీకి వెళ్తుంటాయి. ప్రతీ రోజు రోడ్డంతా చెరుకు బండ్లతో నిండిపోయి కిక్కిరిసిపోతుంది.

దీంతో మాజీ ఎమ్మెల్యే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్‌ జామ్‌ తోచాలా సమస్యలు ఎదురవుతున్నాయని, తన ఇంటిని అమ్మి కుటుంబంతో కలిసి దూరంగా వెళ్లిపోతానని చెబుతున్నారు. కాగా,  ఈ విషయమై షూగర్‌ ఫ్యాక్టరీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని షామ్లి జిల్లా మేజిస్ట్రేట్‌ జస్జీత్‌ కౌర్‌ తెలిపారు. మరి రాజేశ్వర్ బన్సాల్‌కు ట్రాఫిక్‌ సమస్య తీరుతుందా లేదా అనేది చూడాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.