మూడేళ్ల చిన్నారికి బిస్కెళ్ల ఆశ చూపాడు. ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే ప్ర‌మాదం అని హ‌త్య చేసి.. ఆ చిన్నారి శ‌వాన్ని త‌న పెరిటిలో దాచి పెట్టాడు. అనంత‌రం త‌న‌కు ఏమి తెలియ‌న‌ట్లు న‌టించాడు. చివ‌రికి.. ఆ చిన్నారి ధ‌రించిన చెప్పులే.. అత‌ని ఆట క‌ట్టించాయి.

వివ‌రాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో మహోలీ పట్టణంలో నివాసం ఉంటున్న దంపతులకు మూడేళ్ల కుమారై ఉంది. అయితే.. ఓ రోజు దంపతులు పనిమీద సమీపంలోని సీతాపూర్ వెళ్లారు. ఇది గ‌మ‌నించిన పొరుగింటిలో ఉండే రాజు అనే వ్య‌క్తి చిన్నారికి బిస్కెట్లు ఇస్తాన‌ని.. ఆశ చూపి త‌న ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి ఓడిగ‌ట్టాడు. అనంతరం విషయం అందరికీ తెలిసిపోతుందేమోనని భ‌య‌ప‌డి.. చిన్నారి గొంతునులిమి హత్య చేశాడు. చిన్నారి మృతదేహాన్ని ఓ సంచిలో చుట్టేసి పెరట్లో బక్కెట్ కింద దాచేశాడు. అనంత‌రం త‌నకు ఏమీ తెలీదు అన్న‌ట్లు న‌టించ‌సాగాడు.

ఊరెళ్లొచ్చే సరికి.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న త‌మ కుమారై క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు ఊరంతా వెతికారు. ఎంత వెతికినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. అయితే.. ఆ సమయంలో దొరికిన ఓ చిన్న క్లూ హంతకుడిని పట్టించింది.

అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి చెప్పులు.. పొరుగింట్లో ఉండే రాజు ఇంటిలో క‌నిపించాయి. పాప చెప్పులు మీ ఇంట్లో ఎందుకున్నాయి అంటూ రాజుని ప్ర‌శ్నించాడు. రాజు తొలుత బుకాయించాడు. చిన్నారి బంధువులు గ‌ట్టిగా నిల‌దీయంతోఅస‌లు విష‌యం చెప్పాడు. అలాగే పెరట్లో దాచి ఉంచిన శవాన్ని బాలిక బంధువులు గుర్తించారు. స‌మాచారం అందుకున్న పొలీసులు అక్క‌డ‌కు చేరుకుని రాజును అరెస్టు చేశారు.

చిన్నారి మృతదేహాన్ని చూసిన త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. చిన్నారిని దారుణంగా రేప్ చేసి.. కిరాతకంగా చంపేసిన హంతకుడిని వదిలిపెట్టొద్దంటూ పోలీస్ స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగారు. నిందితుడికి క‌ఠినంగా శిక్ష ప‌డేలా చేస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో శాంతించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.