ఓ దొంగ‌ అపార్టుమెంట్‌లో చోరీ చేస్తుండ‌గా.. అక్క‌డి స్థానికుల కంట ప‌డ్డాడు. వారు ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. త‌ప్పించుకొని మ‌రో చోటికి వెళ్లాడు. ఓ ఇంట్లో ఒంట‌రిగా నిద్రిస్తున్న మ‌హిళ‌ క‌న‌ప‌డ‌డంతో అత‌నిలోని కామాంధుడు నిద్ర‌లేచాడు. ఆ మ‌హిళ‌పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘ‌ట‌న చెన్నైలో జరిగింది.

క‌రోనా ముప్పుతో దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ ను ఎవ‌రూ అతిక్ర‌మించ‌కుండా పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఓ దొంగ చోరీకి య‌త్నించ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

అన్నాన‌గ‌ర్‌లోని ఓ అపార్టుమెంట్‌లోకి వెన‌క వైపు నుంచి ఓ యువ‌కుడు లోనికి రావ‌డాన్ని గురువారం సాయ‌త్రం స్థానికులు గుర్తించారు. వారు దొంగ దొంగ అంటూ గ‌ట్టిగా కేక‌లు పెట్ట‌డంతో అత‌డు ప‌రార‌య్యాడు. అక్క‌డ చోరీ ప‌థ‌కం విఫ‌లం కావ‌డంతో తిరుమంగ‌ళం వైపు వెళ్లాడు. ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నంలోకి ప్ర‌వేశించాడు. పై అంత‌స్తు డాబా పై ఒంటరిగా ఓ మ‌హిళ నిద్రిస్తోంది. ఆమెను చూడ‌గానే అత‌డిలోని కామాంధుడు నిద్ర‌లేచాడు. వ‌చ్చిన ప‌నిని ప‌క్క‌న పెట్టి.. మ‌హిళ పై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఆమె అరుపుల‌తో ఇరుగుపొరుగు వారు అక్క‌డికి వ‌చ్చారు. వారి రాక‌ని గ‌మ‌నించి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. స్థానికులు ఆ మ‌హిళ‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు.

స‌మాచారం అందుకున్న అన్నాగ‌న‌ర్ పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. అన్నాన‌గ‌ర్‌, తిరుమంగ‌ళం ప‌రిస‌రాల్లోని సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించి.. అమింజిక‌రైకు చెందిన వేల్‌మురుగ‌న్ కుమారుడు రామ‌కృష్ణ‌న్‌గా గుర్తించారు. ఇందులో ట్విస్టు ఏంటంటే.. ఇత‌ను ఇంత‌ముందే ఓ చోరీ కేసులు అరెస్టు అయ్యాడు. లాక్‌డౌన్ పుణ్య‌మా అని బ‌య‌ట‌కు వ‌చ్చి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. దీంతో పోలీసులు అత‌ని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.