బస్‌ భవన్‌ ఎదుట తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ల ధర్నా

By Newsmeter.Network  Published on  2 Dec 2019 9:05 AM GMT
బస్‌ భవన్‌ ఎదుట తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ల ధర్నా

హైదరాబాద్‌: బస్‌ భవన్‌ ఎదుట తాత్కాలిక తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ సమ్మె సమయంలో 55 రోజులు విధులు నిర్వహించిన తమను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణాలో 'దీక్షా దివస్' సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లో చేరమని చెప్పేశారు. దీంతో సుమారు 52 రోజుల సమ్మెకు తెరపడింది. ఇక కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేయగా.. తాత్కాలిక ఉద్యోగులు మాత్రం తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

అయితే సమ్మె మొదలైన రోజు నుంచి తాము డ్యూటీలు నిర్వహించామని.. ఇప్పుడు ఆర్టీసీ స్టాఫ్ డ్యూటీలలో చేరడంతో.. తమను పట్టించుకునే నాధుడే లేడని.. తాత్కాలిక బస్ డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. కార్మికుల మాదిరిగానే తమపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దయ చూపించి ఆదుకోవాలని వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము విధులు నిర్వర్తించామన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరడంతో తమ పరిస్థితి ఏంటని’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటూ.. ప్రయాణికులను గమ్యస్థలాలకు చేర్చిన తమకు న్యాయం చేయాలంటూ కోరారు.

Next Story
Share it