భర్త ఆఫీసుకి, పిల్లలు స్కూల్‌కు వెళ్లగానే.. తన ప్రియుడిని పిలిపించుకుని రాసలీలలు సాగించేంది. ఓ సారి భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. అయితే.. భార్య అంత నీచానికి పాల్పడుతూ.. దొరికినా క్షమించడమే అతడు చేసిన తప్పైంది. భర్తను అడ్డు తొలగించుకుంటే.. సుఖంతో పాటు ఇన్స్యూరెన్స్ డబ్బలు వస్తాయని ఆశపడి ప్రియుడితో కలిసి దారుణంగా హత్యచేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ధర్మపురి జిల్లా కారిమంగళంలో మాదేశన్, రేవతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేవతి.. జయప్రకాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజూ భర్త ఆఫీసుకి, పిల్లలు స్కూల్‌కి వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాసలీలలు సాగించేది. ఈ క్రమంలో ఓరోజు మాదేశన్‌ పర్సు మరిచిపోయి ఇంటికి వచ్చాడు. ఇంట్లోంచి శబ్దాలు రావడంతో కిటీకిలోంచి బెడ్రూమ్‌లోకి తొంగి చూశాడు. ఇద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్య ప్రాదేయపడడంతో మరోసారి ఇలా చేస్తే ఇద్దరిని చంపేస్తానని బెదరించాడు.

ఇదిలా ఉండగా.. ఓ రోజు మాదేశన్‌ ధర్మపురి-క్రిష్ణగిరి మార్గంలో శవమై కనిపించాడు. రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటాడని భావించి.. పోలీసులు కేసు నమోదు చేసి ఆస్పత్రికి తరలించారు. రేవతి ఆస్పత్రికి వచ్చి.. తన భర్తకు మద్యం అలవాటు ఉందని.. ఆ మత్తులో రోడ్డు పై వెళ్తూ చనిపోయి ఉండొచ్చని పోలీసులకు చెప్పింది.

మాదేశన్‌ డెత్ సర్టిఫికేట్‌ కోసం రేవతి.. డాక్టర్లపై ఒత్తిడి తెచ్చింది. భర్త చనిపోయి వారం రోజులు తిరగకముందే.. డెత్ సర్టిఫికెట్‌ కోసం అంతలా పట్టుబట్టడంతో.. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జయప్రకాశ్‌తో అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. మాదేశన్‌ తన పేరిట రూ.55లక్షలకు ఇన్స్యూరెన్స్ చేయించి భార్యను నామినీగా పెట్టాడు. దీంతో ఆ డబ్బుల కోసమే ఆమె డెత్ సర్టిఫికెట్ కోసం ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.

దీంతో పోలీసులు జయప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజాన్ని కక్కేశాడు. భర్తను చంపితే ఇన్స్యూరెన్స్ డబ్బు వస్తుందని.. మనం హ్యాపీగా ఉండొచ్చునని చెప్పినట్లు జయప్రకాశ్ పోలీసులకు తెలిపాడు. ప్లాన్ ప్రకారం అతడిని మార్గమధ్యలో అడ్డగించి హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించామని చెప్పాడు. దీంతో పోలీసులు రేవతి, జయప్రకాశ్‌తో పాటు హత్యకు సహకరించిన అతడి స్నేహితులు వెంకటేశ్, విఘ్నేష్‌లను అరెస్ట్ చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.