వివాహేత‌ర సంబంధం ఓ ప‌చ్చ‌ని కాపురంలో చిచ్చుపెట్టింది. భ‌ర్త వ్యాపార ప‌నుల‌తో బిజీ ఉండ‌గా.. భార్య ఓ మెడిక‌ల్ షాప్ యువ‌కుడితో అఫైర్ పెట్టుకుంది. ఓ రోజు వీరిద్ద‌రి బాగోతాన్ని చూసిన భ‌ర్త‌.. వీరి బండారాన్ని బ‌య‌ట‌పెట్ట‌డానికి ఆ దృశ్యాల‌ను వీడియో తీశాడు. ఇది గ‌మ‌నించిన భార్య.. భ‌ర్త‌ను కొట్ట‌మంటూ ప్రియుడిని ఆదేశించింది. దీంతో ప్రియుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి ప్రియురాలి భ‌ర్త‌ను క‌త్తుల‌తో బెదిరించాడు. త‌మ సంబంధానికి అడ్డు వ‌స్తే చంపేస్తాన‌ని హెచ్చ‌రించాడు. వారి బారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకున్న ఆ భ‌ర్త పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది.

తమిళనాడులోని దిండుగల్ జిల్లా విల్లాంబట్టి సమీపంలోని ముత్తువాసం ప్రాంతంలో రవిచంద్రన్ (47), సెల్వీ (37) దంపతులు నివ‌సిస్తున్నారు. ర‌విచంద్ర‌న్ వ్యాపార నిమిత్తం ఉద‌యం వెళితే.. రాత్రికి ఇంటికి వ‌చ్చేవాడు. సెల్వీనే ఇంటి ప‌నులు అన్ని చ‌క్క‌బెట్టేది. పిల్ల‌ల‌కు అనారోగ్యానికి గురైన‌ప్పుడు స్థానికంగా ఉండే ఓ మెడిక‌ల్ షాపులో మందులు కొనుగోలు చేసేది. ఈ క్ర‌మంలో ఆమెకు ఆ షాపు ఓన‌ర్ ఉక్కిరపాండి(27)తో పరిచయం ఏర్పడింది.

సెల్వీపై మనసు పడిన ఆ యువకుడు ఆమె మందుల కొనుగోలుకు వచ్చినప్పుడల్లా డిస్కౌంట్ ఇస్తూ ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమె కూడా ఆ షాపు వైపు వెళ్తున్నప్పుడు అతడిని చూసి నవ్వుతూ రెచ్చగొట్టేది. ఇలా కొద్ది రోజులు సాగింది. ఉక్కిరపాండి ఆపుకోలేక ఓ రోజు సెల్వీని కోరిక తీర్చాలంటూ అడిగేశాడు. లోలోపల తాను కోరుకునేది కూడా అదే కావడంతో సెల్వీ అందుకు ఓకే చెప్పింది. భర్త షాప్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయిన తర్వాత ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేంది. అవివాహితుడు కావడంతో ఉక్కిరిపాండి రోజులో మూడు నాలుగు సార్లు ఆమె ఇంటికొచ్చి త‌న కామ‌కోరిక‌ల‌ను తీర్చుకునేవాడు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసినా కూడా వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. వీరి వేషాలు శృతి మించ‌డంతో స్థానికుడొకరు రవిచంద్రన్‌కు విషయం చెప్పాడు. దీంతో పద్ధతి మార్చుకోవాలని అతడు భార్యను హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు.
కాగా రవిచంద్రన్ ప‌ని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. వెంట‌నే సెల్వీ త‌న ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి ర‌ప్పించుకుంది. ఇద్ద‌రూ కామ క్రీడ‌ల్లో మునిగారు. స‌రిగ్గా రవిచంద్ర‌న్ ఇంటికి వ‌చ్చాడు. బెడ్రూమ్ నుంచి శ‌బ్దాలు రావ‌డంతో కిటిలోంచి త‌న‌ భార్య పరాయి వ్యక్తితో నగ్నంగా కనిపించింది. భార్య సంబంధాన్ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాల‌నుకున్నాడు. త‌న సెల్‌ఫోన్ ను తీసి వీడియో ఆ బాగోతం మొత్తాన్ని వీడియో తీశాడు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన సెల్వీ, ఆమె ప్రియుడు బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌విచంద్ర‌న్‌తో గొడ‌వ‌ప‌డ్డారు. నాతో చెప్పకుండా లోనికి ఎందుకొచ్చావంటూ సెల్వీ భర్తను తోసేసింది. అతడిని కొట్టాలంటూ ప్రియుడిని ఉసిగొల్పింది. దీంతో అతడు తన స్నేహితులైన విరుముతురై, కురుప్పాయిని అక్కడికి పిలిపించి రవిచంద్రన్ పై దాడి చేయించాడు. సెల్వీతో అక్రమ సంబంధాన్ని అడ్డుకుంటే నిన్ను చంపేస్తాం అంటూ ఉక్కిరిపాండి, విరుముతురై, కురుప్పాయి కలిసి అతడిని కత్తులతో బెదిరించారు.

వారి బారి నుంచి ఎలాగోలా బ‌య‌ట‌ప‌డిన రవిచంద్రన్ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసలు సెల్వీతో పాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.