దేశంలో బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మదమెక్కిన కొందరు బాలికలపై కామవాంఛ తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. స్విమ్మింగ్‌ పాఠాలు నేర్పాల్సిన ఓ కోచ్‌.. బాలికకు శృంగార పాఠాలు నేర్పాడు. ఈ ఘటన అర్జంటీనాలో చోటు చేసుకుంది. ఓ స్విమ్మింగ్‌ కోచ్‌ పూల్‌లోకి ఓ యుక్తవయసు బాలికను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అంతేకాదు యువతికి మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలుపడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం అతన్ని జైలుకు తరలించారు.

కాగా, అర్జంటీనాకు చెందిన పాల్‌ అనే వ్యక్తి స్విమ్మింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. స్మిమ్మింగ్‌ నేర్చుకునేందుకు వచ్చిన బాలికలపై ఇలాంటి దారుణాలకు పాల్పడతాడని పోలీసులు గుర్తించారు. స్విమ్మింగ్‌ పూల్‌లో కూడా బాలికకు ఒళ్లంత టచ్‌ చేస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించేవాడని బాలిక పోలీసుల ముందు తెలిపింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *